సర్వాయి పాపన్న జీవితం స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2022-08-19T05:57:07+05:30 IST

సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌ అన్నారు.

సర్వాయి పాపన్న జీవితం స్ఫూర్తిదాయకం
పాపన్న చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌పాటిల్‌

కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌ 

సూర్యాపేటటౌన్‌, ఆగస్టు 18: సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సర్వాయి పాపన్నగౌడ్‌ 372వ జయంతి వేడుకల్లో పాల్గొని పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మొట్టమొదటి బహుజన విప్లవవీరుడుగా ప్రజల గుండెల్లో పాపన్నగౌడ్‌ నిలిచి పోయారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లాకేంద్రంలోని ధర్మభిక్షం విగ్రహం వద్ద సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహ సాధన కమిటీ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్‌ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు, జడ్పీ వైస్‌చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్‌, రాపర్తి శ్రీనివాస్‌గౌడ్‌,  బైరు వెంకన్నగౌడ్‌, బూర బాలసైదులుగౌడ్‌, కక్కిరేణి నాగయ్యగౌడ్‌, పంతంగి వీరస్వామిగౌడ్‌, కక్కిరేణి సత్యనారాయనగౌడ్‌, ఎల్గూరి గోవింద్‌గౌడ్‌, వెంకటేశ్వర్లుగౌడ్‌ పాల్గొన్నారు.


క్రీడల్లో గెలుపోటములు సహజం

 క్రీడల్లో గెలుపోటములు సహజమని కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌పాటిల్‌  అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఫ్రీడమ్‌కప్‌లో గెలుపొందిన క్రీడాకారులకు ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి బహుమతులు అందజేసి మాట్లాడారు. క్రీడల ద్వారా సోదరాభావం పెంపొందుతుందన్నారు. క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. పాఠశాలల్లో రాష్ట్రప్రభుత్వం విద్యతో పాటు క్రీడాభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. జిల్లాలో 23 మండలాలు, ఐదు మునిసిపాలిటీల నుంచి 668 మంది విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొన్నారని తెలిపారు. అనంతరం బాలుర కబడ్డీ పోటీలో గెలుపొందిన నూతన్‌కల్‌, బాలిక కబడ్డీలో మేళ్లచెర్వు, బాలుర వాలీబాల్‌ పోటీల్లో నేరేడుచర్ల, బాలికల వాలీబాల్‌ పోటీల్లో నూతన్‌కల్‌ జట్లకు బహుమతి ప్రదానంచేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జడ్పీవైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, డీఈవో అశోక్‌, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, డీఎస్పీ నాగభూషణం, మునిసిపల్‌ కమిషనర్‌ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ జీడిభిక్షం, ప్రజాప్రతినిఽధులు, అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-19T05:57:07+05:30 IST