Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంచాయతీ నిధుల ఖాళీ చేయడంపై న్యాయస్థానాన్ని అశ్రయిస్తాం : సర్పంచులు

కలిగిరి, డిసెంబరు 2: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గ్రామ పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేయడాన్ని తీవ్రంగావ్యతిరేకిస్తున్నామని, దీనిపై న్యాయస్థానాన్ని అశ్రయిస్తామని రావులకొల్లు, ఏపినాపి, పడమరగుడ్లదొన, ఎరుకలరెడ్డిపాలెం, పెదకొండూరు, పోలంపాడు  గంగిరెడ్డిపాలెం సర్పంచులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక ఎంపీడీవోకు వినతిపత్రం అందించి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వం పంచాయతీ ఖాతాల నుంచి నిధులను అర్ధరాత్రి ఖాళీ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్రంలో సొంత రాజ్యాంగంతో ముఖ్యమంత్రి పాలన చేస్తున్నాడని, తమ పంచాయతీలకు సంబంధించి విధులు, నిధుల్లో జోక్యంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యరక్రమంలో సర్పంచులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement