జగనన్న స్వచ్ఛ సంకల్పంపై నేడు సర్పంచులకు శిక్షణ

ABN , First Publish Date - 2021-05-18T04:10:14+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పంచాయతీల్లో పారిశుధ్యం మెరుగు, ఘన వ్యర్థాల నిర్వహణకు జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నట్లు డీపీవో ధనలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

జగనన్న స్వచ్ఛ సంకల్పంపై  నేడు సర్పంచులకు శిక్షణ

డీపీవో ధనలక్ష్మి

నెల్లూరు(జడ్పీ), మే 17 : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పంచాయతీల్లో పారిశుధ్యం మెరుగు, ఘన వ్యర్థాల నిర్వహణకు జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నట్లు డీపీవో ధనలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మనం-మన పరిశుభ్రత కార్యక్రమం ద్వారా జిల్లాలో మొదటి విడత 92, రెండో విడత 284 పంచాయతీల్లో గత ఏడాది జూన్‌ నుంచి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అయితే అన్ని గ్రామాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12.30 వరకు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సర్పంచులకు శిక్షణ ఇస్తామని, ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌, పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరి గోపాలకృష్ణన్‌దివేది పాల్గొని శిక్షణ ఇస్తారని తెలిపారు. మండల ప్రజాపరిషత్‌ కార్యాలయాల్లో సర్పంచులు హాజరు కావాలని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-18T04:10:14+05:30 IST