కొలువుదీరారు..

ABN , First Publish Date - 2021-04-04T05:48:27+05:30 IST

కొత్త సర్పంచ్‌లు కొలువుదీరారు. పండగ వాతావరణంలో అధికారిక బాధ్యతలు చేపట్టారు. పంచాయతీల్లో పాలనకు శనివారం శ్రీకారం చుట్టారు. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో ముగిసిన విషయం తెలిసిందే. అధికారికంగా బాధ్యతల కోసం వారు ఎదురుచూస్తున్న దశలో ప్రభుత్వం ఈ నెల 3న ప్రమాణ స్వీకారం చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు శనివారం పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు బాధ్యతలను చేపట్టాయి.

కొలువుదీరారు..

ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్‌లు

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 03 : కొత్త సర్పంచ్‌లు కొలువుదీరారు. పండగ వాతావరణంలో అధికారిక బాధ్యతలు చేపట్టారు. పంచాయతీల్లో పాలనకు శనివారం శ్రీకారం చుట్టారు. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో ముగిసిన విషయం తెలిసిందే. అధికారికంగా బాధ్యతల కోసం వారు ఎదురుచూస్తున్న దశలో ప్రభుత్వం ఈ నెల 3న ప్రమాణ స్వీకారం చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు శనివారం పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు బాధ్యతలను చేపట్టాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1166 పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు సంవత్సరాల పాటు నూతన పాలకవర్గం అధికారంలో ఉంటుంది. పంచాయతీల్లోని కార్యదర్శులే సర్పంచులతో ప్రమాణస్వీకారం చేయించగా.. మేజర్‌ పంచాయతీల్లో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ప్రమాణం చేయించారు. రాజకీయ నాయకులు, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. 


 చెట్లు, నీటిని సంరక్షిస్తామని..


చెట్లను సంరక్షిస్తామని, నీటి సమస్యలు తీరుస్తామని కొత్త సర్పంచ్‌లు తొలిరోజు ప్రమాణం చేశారు. పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరిచేలా.. ఉన్న వనరులను కాపాడుకుని పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. జలశక్తి అభియాన్‌ కింద పటిష్ట చర్యలు తీసుకుంటామని, నిరంతరం బాధ్యతాయుతంగా పాలన సాగిస్తామని సర్పంచ్‌లతో కార్యదర్శిలు, ఈఓలు ప్రమాణస్వీకారం చేయించారు. 


నేటి నుంచి ఐదేళ్లు 

 జిల్లా అంతటా కొత్త సర్పంచ్‌లు కొలువుదీరారు. ఐదేళ్లపాటు పదవుల్లో కొనసాగుతారు. వారంతా ఐక్యంగా పంచాయతీ వనరులను కాపాడుకుంటూ పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంది. సర్పంచ్‌లు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తే పల్లెలు అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చెందుతాయి. 

- రవికుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి

Updated Date - 2021-04-04T05:48:27+05:30 IST