సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు

ABN , First Publish Date - 2022-06-25T06:14:45+05:30 IST

సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు

సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు
యలమంచిలి మండల సమావేశంలో సర్పంచ్‌ల వాగ్వాదం

లబ్ధిదారుల జాబితాలు, అభివృద్ధి పనులు తెలియజేయడం లేదు
మండల సమావేశంలో జడ్పీ చైర్మన్‌, అధికారులను ప్రశ్నించిన ఇలపకుర్రు, పెదలంక సర్పంచ్‌లు

యలమంచిలి, జూన్‌ 24: సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని, గ్రామాల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలను తమకు తెలియజేయడం లేదని..ఇది సమంజసమా? అని టీడీపీకి చెందిన ఇలపకుర్రు, పెదలంక గ్రామాల సర్పంచ్‌లు కొండేటి జీవరత్నం, తాళ్ల నాగరాజు మండల సర్వ సభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్‌, అధికారులను ప్రశ్నించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ రావూరి వెంకటరమణ అధ్యక్షతన శుక్ర వారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జడ్పీ ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ విచ్చేశారు. శాఖలవారీగా అధికారులతో ఆయన సమీక్ష నిర్వ హిస్తుండగా లబ్ధిదారుల జాబితాలు, అభివృద్ధి కార్యక్రమాలను తమకు తెలియనీయడం లేదని ఇలపకుర్రు, పెదలంక సర్పంచ్‌లు ఆరోపించారు. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు లబ్ధిదారులను నిర్ణయించేవని.. ఇప్పుడు వలంటీర్ల ద్వారా అర్హులందరికీ సంక్షేమాన్ని అంది స్తున్నామని పలువురు వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అన్నారు. దీంతో సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. లబ్ధిదారుల ఎంపికను తాము ప్రశ్నించడం లేదని, జాబితాలు అందజేయక పోవడం ఎంత వరకు సమంజసమో చెప్పాలని టీడీపీ సర్పంచ్‌లు నిలదీశారు. సమస్యపై అధికారులు సమాధానం చెప్పాలని వైసీపీ సర్పం చ్‌లు కలుగజేసుకోవడం ఏమిటన్నారు. సర్పంచ్‌లకు వివరాలు అంది స్తామని,  పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారుల జాబితా ప్రదర్శిస్తున్నా మని ఎంపీడీవో సీహెచ్‌ త్రిశూలపాణి అన్నారు. పార్టీలకతీతంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని జడ్పీ ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ చెప్పారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు 6 నుంచి 9 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. సర్పంచ్‌ల చాంబర్‌ అధ్యక్షుడు వల్లభు నర్సింహారావు, తహసీల్దారు ఎల్‌.నర్సింహారావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T06:14:45+05:30 IST