హుజురాబాద్‌లో బీజేపీకి సర్పంచ్ మద్దతు

ABN , First Publish Date - 2021-09-04T23:31:05+05:30 IST

జిల్లాలో ఉపఎన్నిక జరుగనున్న హుజురాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీకి

హుజురాబాద్‌లో బీజేపీకి సర్పంచ్ మద్దతు

కరీంనగర్‌: జిల్లాలో ఉపఎన్నిక జరుగనున్న హుజురాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీకి సర్పంచ్ మద్దతు ప్రకటించాడు. వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి, బీజేపీకి మద్దతు తెలిపాడు. తనకు 59లక్షల బిల్లులు రావాలని  బిల్లులు ఇవ్వకుండా తనపై పోలీస్ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆరోపించారు. గతంలో మీటింగ్‌లో మంత్రి గంగుల కమలాకర్ కనబడితే బిల్లులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, అందుకోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరానని ఆయన ప్రకటించారు. అయితే తనకు రూ.15లక్షల బిల్లులు మాత్రమే ఇచ్చారని, మిగితా బిల్లులు ఇవ్వడం లేదని సర్పంచ్ ఎల్లారెడ్డి ఆరోపించారు. 

Updated Date - 2021-09-04T23:31:05+05:30 IST