Abn logo
Aug 7 2021 @ 19:59PM

టీఆర్‌ఎస్‌‌కు సర్పంచ్‌ రాజీనామా

చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలంలోని గంగారాం గ్రామ సర్పంచ్‌ దుర్గం నగేష్‌.. టీఆర్‌ఎస్‌‌కు శనివారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో  రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ఎంపీపీకి పంపినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్‌ పార్టీని వదిలి టీఆర్‌ఎస్‌లో చేరానని, కానీ సరైన గుర్తింపు లేక అవమానాలే ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం అభివృద్ధిపై ప్రజలకు సమాధానం చెప్పలేక రాజీనామా చేస్తున్నట్లు నగేష్‌ పేర్కొన్నారు.