Sarpanch Lavanya: మాపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కక్ష పెంచుకున్నారు: కల్లెడి సర్పంచ్

ABN , First Publish Date - 2022-08-02T20:03:41+05:30 IST

ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యకు కుట్ర జరిగిందన్నదానిపై స్పందించిన సర్పరంచ్ లావణ్య ఏమన్నారంటే..

Sarpanch Lavanya: మాపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కక్ష పెంచుకున్నారు: కల్లెడి సర్పంచ్

హైదరాబాద్ (Hyderabad): బంజారాహిల్స్‌, రోడ్డు నెంబర్ 12లోని ఎమ్మెల్యే (MLA) జీవన్ రెడ్డి (Jeevan reddy)పై హత్యకు కుట్ర జరిగిందన్నదానిపై ఆర్మూర్‌కు చెందిన కల్లెడ గ్రామ సర్పంచ్ లావణ్య (Sarpanch Lavanya) స్పందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో తమకు గొడవ జరిగిందని, అప్పటినుంచే ఆయన మాపై కక్ష పెంచుకున్నారని చెప్పారు. కల్లెడిలో తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన.. రూ.18 లక్షల బిల్లులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆపేశారని ఆరోపించారు. అకారణంగా తనను సస్పెండ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చాలాసార్లు ఎమ్మెల్యే, కలెక్టర్ చుట్టూ తిరిగామన్నారు. చివరికి హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను కలవడానికే తన భర్త ప్రసాద్ గౌడ్‌ వెళ్లారని తెలిపారు. తన భర్త కత్తి, తుపాకీ తీసుకెళ్లాడని దుష్ప్రచారం చేస్తున్నారని సర్పంచ్‌ లావణ్య వాపోయారు.

Updated Date - 2022-08-02T20:03:41+05:30 IST