చెక్‌పవర్‌పై పూర్తి బాధ్యత సర్పంచ్‌లదే

ABN , First Publish Date - 2021-06-22T05:33:38+05:30 IST

పంచాయతీలో చెక్‌పవర్‌పై పూర్తి బాధ్యత సర్పంచ్‌లదేనని చోడవరం సబ్‌ ట్రెజరీ అధికారి సీహెచ్‌టీ రామారావు చెప్పారు.

చెక్‌పవర్‌పై పూర్తి బాధ్యత సర్పంచ్‌లదే
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్టీవో రామారావు

తేడా వస్తే ర ద్దు: ఎస్టీవో రామారావు

చోడవరం, జూన్‌ 21:
పంచాయతీలో చెక్‌పవర్‌పై పూర్తి బాధ్యత సర్పంచ్‌లదేనని చోడవరం సబ్‌ ట్రెజరీ అధికారి సీహెచ్‌టీ రామారావు చెప్పారు. మండల పరిషత్‌ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు చెక్‌పవర్‌పై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెక్‌ వినియోగంలో సర్పంచ్‌దే కీలక పాత్ర అన్నారు. కార్యదర్శులు ఉన్నా సర్పంచ్‌కే ప్రధాన బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు. చెక్‌పవర్‌ వినియోగించే సమయంలో సీఎఫ్‌ఎం నిబంధనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుని బిల్లులు పెట్టాలని, అందుకనుగుణంగా చెక్‌లు జారీ చేయాలని సూచించారు. ఈ విషయంలో తప్పులు జరిగితే సర్పంచ్‌లు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, తేడా వస్తే చెక్‌పవర్‌ రద్దు చేస్తామని ఎస్టీవో హెచ్చరించారు. ఎంపీడీవో శ్యాంసుందర్‌ మాట్లాడుతూ, అందరం కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధికి పనిచేయాలని విజ్ఞప్తి చే శారు. సమావేశంలో ఈవోపీఆర్డీ చైతన్య, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:33:38+05:30 IST