గుండెపోటుతో సర్పంచ దామోదర్‌ మృతి

ABN , First Publish Date - 2022-01-17T06:49:55+05:30 IST

బిల్లులు మంజూరుకాక పోవడం తో మనోవేదన చెందిన గుండెపోటుతో ఓ సర్పంచ మృతి చెందా డు.

గుండెపోటుతో సర్పంచ దామోదర్‌ మృతి
కొర్ర దా మోదర్‌

బిల్లులు మంజూరుకాకపోవడంతో కొన్ని రోజులుగా మనస్తాపం

దేవరకొండ మండలం సూర్యతండాలో విషాదఛాయలు

దేవరకొండ, జనవరి 16: బిల్లులు మంజూరుకాక పోవడం తో మనోవేదన చెందిన గుండెపోటుతో ఓ సర్పంచ మృతి చెందా డు. ఈ ఘటన దేవరకొండ మండలం సూర్యతండాలో ఆదివా రం చోటుచేసుకుంది. తండావాసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌ స్వగ్రామం సూర్యతండా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొర్ర దా మోదర్‌(42) 2019 ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచగా ఎన్నికయ్యాడు. అప్పటినుంచి సొంత డబ్బులతో తండాలో పలు అభివృద్ధి పనులు నిర్వహించాడు. పిల్లల చదువుల నిమిత్తం ఆయన దేవరకొండలో ఉంటూ తండాకు వెళ్లి వస్తుండేవాడు. ప్రభుత్వం చే పట్టిన డంపింగ్‌ యార్డుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాడు. ఏకగ్రీవంగా ఎన్నికైనా నిధులు రాకపోవడంతో పాటు, అప్పుచేసి రూ.10లక్షలు సొంత ఖర్చుతో అభివృద్ధి పనులు చేయించాడు. అప్పు తీర్చేందుకు ఇటీవల ఎకరం భూమి కూడా విక్రయించాడు. అతడికి ఇద్దరు కుమారులు కాగా, పెద్దకుమారుడికి జ్వరం రా వడంతో భార్య సుజాత హైదరాబాద్‌  ఆస్పత్రికి తీసుకెళ్లింది. సంక్రాంతి పండుగ కావ డంతో ఆమె అక్కడే ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. దేవరకొండలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉన్న దామోదర్‌ శనివారం రాత్రి గుండెపోటుతో ఇంట్లోనే మృతి చెందాడు. ఆదివారం ఉదయం భార్య ఫోన చేసినా ఎత్తలేదు. దీంతో మధ్యాహ్నం 12గంటల స మయంలో దామోదర్‌ తమ్ముడు రవి, బంధువులు ఇంటికి వెళ్లి ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో కిటికి అద్దాలను పగులగొట్టి చూడగా మంచంపై కదలకుం డా పడివున్నాడు. వెంటనే ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం స్వగ్రామానికి తరలించారు. గుండెపోటుతోనే సర్పంచ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. కాగా, అందరితో ఆత్మీయంగా ఉండే దామోదర్‌ మృతి చెందడంతో సూర్యతండాలో సంక్రాం తి పండగ రోజున విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2022-01-17T06:49:55+05:30 IST