అభివృద్ధి పనులకు అడ్డొస్తున్నారు..

ABN , First Publish Date - 2022-06-27T06:49:43+05:30 IST

సర్పంచ్‌గా ఎన్నికైన దగ్గర నుంచి వేధింపులకు గురిచేస్తూ అభివృద్ధి పనులకు అధికారపక్ష నేతలు అడ్డుపడుతున్నారని కోరుకొల్లు సర్పంచ్‌ బట్టు లీలా కనకదుర్గ ఆరోపించారు.

అభివృద్ధి పనులకు అడ్డొస్తున్నారు..
సర్పంచ్‌ కనకదుర్గ

రూ.5 లక్షల మట్టిని అమ్ముకున్నారు

అధికార పక్ష నేతలపై కోరుకొల్లు సర్పంచ్‌ ఆరోపణలు

కలిదిండి, జూన్‌ 26: సర్పంచ్‌గా ఎన్నికైన దగ్గర నుంచి వేధింపులకు గురిచేస్తూ అభివృద్ధి పనులకు అధికారపక్ష నేతలు అడ్డుపడుతున్నారని కోరుకొల్లు సర్పంచ్‌ బట్టు లీలా కనకదుర్గ ఆరోపించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య పనుల నిర్వహణకు సహకరించటం లేదన్నారు. కొంత మంది డ్రైనేజీలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో  రోడ్లపైకి మురుగునీరు వస్తోందన్నారు. అక్రమ కట్టడాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవటం లేదన్నారు. పారిశుధ్య వాహనాలున్నా వినియోగించటం లేదన్నారు.  ఈ విషయమై  అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. పంచాయతీ షాపుల వేలానికి సహకరించకపోవటంతో పంచాయతీ ఆదాయానికి రావడం లేదన్నారు. చైతన్యపురంలో మంచినీటి చెరువు పూడికతీత పేరిట సుమారు రూ. 5 లక్షల విలువైన మట్టిని బయటకు అమ్ముకున్నారని ఆరోపించారు. పాలకవర్గ సభ్యులు, అధికారులు సహకరిస్తే వెంటనే పారిశుధ్య పనులు చేపడతామన్నారు. 

Updated Date - 2022-06-27T06:49:43+05:30 IST