Abn logo
Sep 15 2020 @ 11:55AM

లొకేషన్స్‌ వేటలో సర్కారు వారి టీమ్‌

Kaakateeya

కోవిడ్‌ ప్రభావం నుండి పూర్తిగా బయటపడలేదు కానీ.. అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ వారి వారి పనుల్లో బిజీగా మారుతున్నారు. ఈ కమ్రంలో సినీ పరిశ్రమ కూడా నెమ్మదిగా పనులను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విధి విధానాలను పాటిస్తూ మేకర్స్‌, స్టార్స్‌ షూటింగ్స్‌ను షురూ చేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున, చైతన్య, అఖిల్‌ వంటి స్టార్స్ సహా కొందరు చిన్న నిర్మాతలు సినిమా షూటింగ్స్‌ను స్టార్ట్ చేశారు. త్వరలోనే సూపర్‌స్టార్‌ మహేశ్‌ కూడా 27వ సినిమా 'సర్కారువారి పాట'ను సెట్స్‌పైకి తీసుకెళ్లేలా మేకర్స్‌ సన్నాహాలు చేసుకుంటున్నారట. అమెరికాలో భారీ షెడ్యూల్‌ను పరుశురామ్‌ ప్లాన్‌ చేశారట. అందుకు తగినట్లే యు.ఎస్‌లో లొకేషన్స్‌ వేటలో యూనిట్‌ సభ్యుల బిజీ బిజీగా ఉన్నారట. అంతా ఓకే అనుకున్న తర్వాతే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట. కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement