Apr 13 2021 @ 13:15PM

'సర్కారు వారి పాట' సెకండ్ షెడ్యూల్ షురూ..!

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. మహేష్ కెరీర్‌లో తెరకెక్కుతున్న 27వ సినిమా 'సర్కారు వారి పాట' ఇప్పటికే దుబాయ్‌లో నెల రోజుల భారీ షెడ్యూల్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరస హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న మహేష్ బాబు ఈసారీ పాన్ ఇండియన్ రేంజ్ కథతో రాబోతున్నాడు. 

బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తునాడు. యూనివర్సల్ కథాంశం కావడం...ఇప్పటికే టైటిల్ పోస్టర్ అండ్ మహేష్ లుక్ మీద పాజిటివ్ రెస్పాన్ రావడంతో 'సర్కారు వారి పాట' సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే గత కొన్ని రోజులుగా 'సర్కారు వారి పాట' సెకండ్ షెడ్యూల్ దుబాయ్‌లో మొదలవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్‌పోన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కాగా తాజాగా 'సర్కారు వారి పాట' చిత్ర బృందం సెకండ్ షెడ్యూల్ ప్రారంభించినట్టు వెల్లడించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ తాజా షెడ్యూల్ జరుపుతున్నారట. తాజాగా మొదలైన ఈ షెడ్యూల్ 25 రోజుల పాటు సాగుతుందని సమాచారం. ఇక ఈ సినిమాని 2022 జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. 'సర్కారు వారి పాట' సినిమాకి మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు.