Jun 11 2021 @ 14:22PM

కంగారొద్దు.. మేమే చెప్తాం..!

కంగారొద్దు మేమే చెప్తాం అంటున్నారు 'సర్కారు వారి పాట' టీమ్. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా 'సర్కారు వారి పాట'. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. టైటిల్ పోస్టర్‌తోనే భారీ అంచనాలు ఏర్పరచిన ఈ సినిమా రెండవ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం అయి కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. పరిస్థితులు కాస్త అదుపులోకి వస్తుండటంతో ఒక్కో సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు ఆయా చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట గురించి సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏదైనా వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. దాంతో తాజాగా మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. త్వరలో ప్రారంభమవబోయే షెడ్యూల్ షూట్ నుంచి ప్రతి అప్‌డేట్‌ను వెల్లడిస్తామని, అప్పటి వరకు ప్రతి ఒక్కరు కోవిడ్‌తో జాగ్రత్తగా ఉండండి..అప్‌డేట్ కోసం వేచి ఉండాలని తెలిపారు.