Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 12 Feb 2022 18:33:04 IST

‘సర్కారు వారి పాట’.. సాంగ్ లీకైంది

twitter-iconwatsapp-iconfb-icon

ఫిబ్రవరి 14, ప్రేమికుల రోజు పురస్కరించుకుని ‘సర్కారు వారి పాట’ టీమ్ విడుదల చేయాలనుకున్న ‘కళావతి’ సాంగ్ ముందే లీకైంది. ఫిబ్రవరి 12వ తేదీ నెట్ ప్రపంచంలో ఈ సాంగ్ దర్శనమివ్వడంతో చిత్రయూనిట్‌ అయోమయానికి గురవుతోంది. దీనిపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేయబోతోన్నట్టు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. 


ఫస్ట్ సింగిల్‌తో చిత్ర ప్రోమోషన్‌ని స్టార్ట్ చేయాలని భావించిన మేకర్స్, ప్రేమికుల రోజు ప్రత్యేకంగా ‘కళావతి’ పాటను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పిక్స్ కూడా విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ శనివారం సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో.. చిత్రయూనిట్‌లో ఆందోళన మొదలైంది. ఈ పాట ఎలా బయటికి వచ్చిందా? అని మేకర్స్ సీరియస్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మహేష్ అభిమానులు కూడా.. ‘చెప్పిన తేదీ వరకు పాటనే బయటికి రాకుండా ఆపలేకపోయారు.. ఇక సినిమా సంగతి ఏంటో?’ అంటూ మేకర్స్‌పై ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement