Abn logo
May 23 2020 @ 17:18PM

ఈసారి ఈద్ జరుపుకోను.. వలస కార్మికులకు సహాయం చేస్తా: సర్ఫరాజ్

కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభంకాగానే క్రికెట్ కార్యకలాపాలు అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఇతర క్రీడాకారులతో పాటు క్రికెటర్లు కూడా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ లాక్‌డౌన్ సమయంలోనే ముస్లింల పండుగ రంజాన్ వస్తుంది. అయితే ఈ ఏడాది రంజాన్ పండుగ జరుపుకొనే బదులుగా.. ఆ డబ్బుతో వలస కార్మికులకు సహాయం చేస్తానని.. యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ వెల్లడించాడు. 


‘‘ఈ ఏడాది ఈద్ జరుపుకోవడం లేదు. ఈద్ సందర్భంగా కొనుగోలు చేసే బట్టలు, వస్తువులకు అయ్యే ఖర్చుతో కష్టాల్లో ఉన్నవాళ్లకి సహాయం చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఆర్థికంగా బాగున్నవారందరూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను’’ అని సర్ఫరాజ్ తెలిపాడు. 


సర్ఫరాజ్‌తో పాటు యశశ్వీ జైస్వాల్‌ కూడా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొనేందుకు ముందుకు వచ్చాడు. ‘‘కరోనా వైరస్ భయంతో తమ స్వగ్రామాలకు వెళ్తున్న ఎందరికో మేము భోజనం, మంచి నీళ్లు అందిస్తున్నాము. చాలారోజులుగా ప్రయాణం చేస్తున్న వాళ్లు ఆకలితో బాధపడుతున్నారు. రంజాన్ సమయంలో మేము ఉపవాసంలో ఉంటాము. కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు’’ అని సర్ఫరాజ్ తెలిపాడు. 

Advertisement
Advertisement
Advertisement