సత్తెమ్మతల్లికి సారె మహోత్సవం

ABN , First Publish Date - 2022-08-09T06:25:04+05:30 IST

పట్టణంలోని దాసరిగెడ్డ రోడ్డులో గల సత్తెమ్మతల్లి జాతర బుధవారం జరగనున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం అమ్మవారికి భక్తులు సారెను సమర్పించారు.

సత్తెమ్మతల్లికి సారె మహోత్సవం
ఊరేగింపుగా ఆలయానికి సారెను తీసుకు వెళుతున్న మహిళలు

   మహిళలు  ర్యాలీగా తరలి వెళ్లి ఆలయంలో అమ్మవారికి సమర్పణ

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 8 : పట్టణంలోని దాసరిగెడ్డ రోడ్డులో గల సత్తెమ్మతల్లి జాతర బుధవారం జరగనున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం అమ్మవారికి భక్తులు సారెను సమర్పించారు. తొలుత మహిళలు వివిధ రకాల పిండి వంట లను ఇళ్లలో తయారు చేసిన అనంతరం పళ్లాల్లో అమర్చి గవరపాలెంలోని పురవీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి నైవే ద్యంగా సమర్పించారు. సత్తెమ్మతల్లి యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఆడారి నరసింగరావు, దొడ్డి రాముడు, కన్వీనర్‌ అప్పారావు, యూత్‌ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు చదరం జగన్నాథరావు, భీశెట్టి తిరుమల, రామచంద్రరావు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T06:25:04+05:30 IST