సర్ధార్‌ పాపన్న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-19T06:03:14+05:30 IST

రాజ్యాధికారం కోసం సర్వాయి పాపన్నగౌడ్‌ సాగించిన పోరాటాన్ని బహుజనులు స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ పిలుపునిచ్చారు.

సర్ధార్‌ పాపన్న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
చౌటుప్పల్‌లో విగ్రహం ఆవిష్కరిస్తున్న మాజీ ఎంపీ బూర తదితరులు

చౌటుప్పల్‌ టౌన్‌, ఆగస్టు 18: రాజ్యాధికారం కోసం సర్వాయి పాపన్నగౌడ్‌ సాగించిన పోరాటాన్ని బహుజనులు స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ పిలుపునిచ్చారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో చౌ టుప్పల్‌లో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్నగౌడ్‌, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మబిక్షం విగ్రహాలను గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఉజ్జిణి యాదగిరిరావు, మాజీ ఎమ్మె ల్సీ కర్నె ప్రభాకర్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా స్‌గౌడ్‌, పల్లె రవికుమార్‌, కత్తి కార్తిక, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ బత్తుల శ్రీశైలం, గ్రంథాలయ చైర్మన్‌ మల్లేశ్‌, సర్పంచ్‌ యాదయ్య ఉన్నారు.

భువనగిరి టౌన్‌: జమిందార్లు, భూస్వాములపై పోరాడిన ఘనత సర్వాయి పాపన్నదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హన్మంతరావు అన్నారు. భువనగిరి ఖిల్లా వద్ద నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతిలో మా ట్లాడారు. భువనగిరి ఖిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర పర్యా టక శాఖకు ఉందన్నారు. మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన అంజనేయులు, వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య, మునిసిపల్‌ కమిషర్‌ బి. నాగిరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ ఎడ్ల రాజేందర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ. శ్యాంసుందర్‌రావు బీసీ సంఘాల జిల్లా అధ్యక్షులు కొత్త నర్సింహస్వామి, రావుల రాజు, అతికం లక్ష్మీనారాయణగౌడ్‌, సుర్వి లావణ్య, తంగెళ్లపల్లి రవికుమార్‌ మాట్లాడారు.

మోత్కూరు: పాపన్న ఆశయ సాధనకు కృషిచేయాలని బీసీ రిజర్వేషన్‌ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌ కోరారు. మోత్కూరులో సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి అనంతుల దేవాంజి, నిలిగొండ మత్స్యగిరి, మునిసిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు గనగాని నర్సయ్య, మాజీ సర్పంచ్‌లు తండ సత్తయ్య, గడ్డమీది రమేష్‌, సూదగాని పాండు, నాయకులు కారుపోతుల శ్రీను, బీసు యాదగిరి, కోల శ్రీను, యాదగిరి, బీఎస్పీ నాయకులు గజ్జెల్లి యాదగిరి, కొంపెల్లి రాజు, మెంట స్వామి, పా ల్గొన్నారు. పాటిమట్లలో సర్పంచ్‌ దండెబోయిన మల్లేష్‌ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

అడ్డగూడూరు: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అడ్డగూడూరులో సర్వాయి పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు.  కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, బుర్ర శ్రీనివాస్‌, అనం తుల దేవంజీ, సూదగాని పాండు, పూజారి స్తెదులు, మఽధు పాల్గొన్నారు. 

ఆత్మకూరు(ఎం): సర్వాయి పాపన్న జయంతి కేంద్రంతో పాటు  పోతి రెడ్డిపల్లె గ్రామాల్లో నిర్వహించారు. మండల పరిషత్‌, తహసీల్దార్‌ కార్యా లయాల్లో ఆయన చిత్రపటానికి, పోతిరెడ్డిపల్లెలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ,  జడ్పీ టీసీ కే. నరేందర్‌, ఎంపీడీవో ఏ.రాములు, డీటీ వి. జయలక్ష్మీ, ఆర్‌ఐ సీహెచ్‌ యాదగిరి, ఎంపీవో పద్మావతి, పోతిరెడ్డిపల్లె సర్పంచ్‌ గనగాని మాధవి మల్లేశం, ఎండీ యూసుఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

మోటకొండూరు: మండలంలో సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి ని ర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వీరస్వామి, ఇక్కుర్తి సర్పంచ్‌ చా మకూర అమరేందర్‌రెడ్డి, ఎంపీవో కిషన్‌, బురాన్‌, అలివేలు పాల్గొన్నారు. 

రామన్నపేట: ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో పాపన్న చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బెల్లి యాదయ్య, ఎస్‌ఐ లక్ష్మయ్య, శంకర్‌, కృష్ణారెడ్డి, మల్లయ్య, నరసింహ పాల్గొన్నారు. 

భూదాన్‌పోచంపల్లి: పాపన్నగౌడ్‌ జయంతిని పట్టణంలోని గౌడ సంఘం భవనంలో నిర్వహించారు. కార్యక్రమంలో కల్లుగీత పారిశ్రామిక స ంఘం అధ్యక్షుడు బండి యాదగిరిగౌడ్‌, కొయ్యడ నర్సింహగౌడ్‌, గుని గంటి మల్లేష్‌గౌడ్‌, బండి మహేష్‌గౌడ్‌, బాలరాజు, బాలయ్యగౌడ్‌ పాల్గొన్నారు. 

వలిగొండ: ప్రభుత్వ ప్రైవేట్‌ కార్యాలయాలు, కుల సంఘాల ఆధ్వ ర్యంలో పాపన్నగౌడ్‌ జయంతి నిర్వహించారు. విగ్రహాలకు, చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్‌రాజు, సర్పంచ్‌ బోళ్ల లలితాశ్రీనివాస్‌, ఎంపీడీవో గీతారెడ్డి ఉన్నారు. 

గుండాల: సర్వాయి పాపన్న జయంతి మండలంలో ఘనంగా నిర్వహి ంచారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు ఈరసరపు యాదగిరి, జై గౌడ్‌ ఉద్యమ రాష్ట్ర కార్యదర్శి గూడ మధుసూదన్‌గౌడ్‌ నాయకులు సూఽ దగాని రామచంద్రయ్య, వెంకన్న, అంజయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

బీబీనగర్‌: మండల పరిషత్‌ కార్యాలయంలో సర్వాయిపాపన్న చిత్రప టానికి ఎంపీపీ యర్రల సుధాకర్‌గౌడ్‌ పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. వెంకిర్యాలలో జరిగిన కార్యక్రమంలో నాయకులు గోడళ్ల బాల్‌రా జ్‌ గౌడ్‌, సర్పంచ్‌ అరిగె సుదర్శన్‌, నాయకులు చెరుకు అచ్చయ్యగౌడ్‌, రాచ మల్ల శ్రీనివాస్‌, బాల్‌రాజ్‌గౌడ్‌, కుమార్‌గౌడ్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు. 

ఆలేరు రూరల్‌: బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడి బహుజన రాజ్యాన్ని స్థాపించిన గొప్ప యోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ అని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి కొనియాడారు. మండలకేంద్రంలో సర్వాయి పాపన్నగౌడ్‌  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్‌ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ గీస కృష్ణంరాజు, ఎల్లందుల మల్లేష్‌, రాజయ్య ఉన్నారు. సర్వాయి పాపన్న యువసేన ఆధ్వర్యంలో ఆలేరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగు లకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పులిపలుకుల మహేష్‌గౌడ్‌, మునిసిపల్‌  వైస్‌చైర్మన్‌ మొరిగాడి మాధవివెంకటేష్‌, సీస రాజేష్‌, నవీన్‌, కళ్లెం రాజు, సూదగాని సాగర్‌, ఐలి సందీప్‌, కళ్లెం జితేందర్‌ పాల్గొన్నారు. 

రాజాపేట: మండలకేంద్రంలో సర్వాయిపాపన్న చిత్రపటానికి నివాళు ర్పించారు. కార్యక్రమంలో నాయకులు గోపగాని బాలమణి, మహేందర్‌ గౌడ్‌, సిలివేరు బాల్‌రాజ్‌, ఆబెపు శ్రీశైలం, గోపాల్‌ పాల్గొన్నారు. 

యాదగిరిగుట్ట రూరల్‌: సర్ధార్‌ సర్వాయి పాపన్న ఆశయాలను సాధించాలని ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీ బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. గౌడ భవనం ఎదుట ఉన్న పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కా నుగు బాలరాజ్‌గౌడ్‌, గుండ్లపల్లి భరత్‌గౌడ్‌, గుండు నర్సింహ్మగౌడ్‌ పాల్గొన్నారు. కొత్తగుండ్లపల్లి గౌడ, గీతాపనివార సంఘాల ఆధ్వర్యంలో పాప న్నగౌడ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మిట్ట వెంకటరమణగౌడ్‌, గుండ్లపల్లి బంగారిగౌడ్‌, సూదగాని పాండుగౌడ్‌, కానుగు సత్యనారాయణగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T06:03:14+05:30 IST