Abn logo
Nov 1 2020 @ 01:36AM

దూరదృష్టిగల మహనీయుడు పటేల్‌

ఖమ్మం సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌, భద్రాద్రి ఎస్పీ సునిల్‌ దత్‌

ముగిసిన పోలీసు అమరవీరుల వారోత్సవాలు


ఖమ్మంక్రైం/ కొత్తగూడెం, అక్టోబరు 31: దేశ సమగ్రత కోసం పాటుపడిన దూరదృష్టి గల మహనీయుడు వ్యక్తి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని ఖమ్మం సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునిల్‌దత్‌ పేర్కొన్నారు. అమరవీరుల వారోత్సవాల ముగింపు సందర్భంగా పటేల్‌ జయంతి( ఏక్తా దివస్‌)ని భద్రాద్రిలో ఎస్పీ కార్యాలయంలో, ఖమ్మంలో పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజల భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు  కృషిచేస్తామని పోలీసు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.


అనంతరం వారు మాట్లాడుతూ   దేశ రక్షణ కోసం అసువులు బాసి అమరులైన పోలీసులను స్మరించుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు అండగా పోలీసుశాఖ ఉంటుందని  అన్నారు. ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో ఏడీసీపీ మాధవరావు, ఎస్‌బీ ఏసీపీ ప్రసన్నకుమార్‌, సీసీఆర్బీ ఏసీపీ ఎల్‌సీనాయక్‌, సీటీసీ ఏసీపీ ప్రసాద్‌, సీఐలు సంపత్‌, రవీందర్‌, కొత్తగూడెంలో  ఓఎస్డీ వి. తిరుపతి, అడిషనల్‌ ఎస్పీ బి. కిష్టయ్య, ఏవో వెంకటేశ్వర్లు, ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు బాలాజీ, రవి, డీసీఆర్‌బీ సీఐ షుకూర్‌, సీఐ కే. శ్రీను, ఆర్‌ఐలు కృష్ణ, సోములు, దామోదర్‌, కామరాజు, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, రతీష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement