టి. నరసాపురంలో పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ భరత్
టి.నరసాపురం, నవంబరు 29: బడుగు, బలహీన వర్గాల వారికి సమష్టి కృషితోనే రాజ్యాధికారం దక్కుతుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ అన్నారు. టి.నరసాపురంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ మూడువందల ఏళ్ల క్రితమే బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలని పోరాడిన గొప్ప నేత సర్వాయి పాపన్న అన్నారు. ఏలూరు ఎంపీ శ్రీధర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందిస్తుందని తెలిపారు. గౌడ కార్పొరేషన్ చైర్మన్ శివరామకృష్ణ, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.
దేవరపల్లి: యర్నగూడెంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠకు ఎంపీ భరత్‌రామ్ శిలాఫలకం ఆవిష్కరించారు. యర్న గూడెం గౌడ సంఘం ఆధ్వర్యంలో విగ్రహం ప్రతిష్టించనున్నారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రాష్ట్ర గౌడ సంఘం చైర్మన్ జోగి రమేష్ గౌడు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, తదితరులు పాల్గొన్నారు.