Abn logo
Mar 2 2021 @ 01:19AM

మొరాయిస్తున్న సర్వర్‌


ఇబ్బంది పడుతున్న కార్డుదారులు

కొత్తపేట(చీరాల), మార్చి 1 : ఇంటింటికీ రేషన్‌ పథకంలో భాగంగా సర్వర్‌ సమస్యతో ఈపోస్‌ మిషన్‌ తరచూ మొరాయిస్తోంది. దీనివల్ల కార్డుదారులు ఇబ్బందులుపడుతున్నారు. ఈ విధానం వల్ల అదనపు నిరీక్షణ తప్పితే ఎలాంటి ప్రయోజనమూ లేదని కార్డుదారులు పెదవివిరుస్తున్నారు. సోమవారం వాహనాల వద్దకు రేషన్‌ బియ్యం కోసం వెళ్లిన వారికి సర్వర్‌ తరచూ మొరాయించటంతో సిబ్బంది వెంటనే సరుకులు ఇవ్వలేకపోయారు. మళ్లీ రండి అని చెప్పి పంపారు. సర్వర్‌ ఎప్పుడు వస్తుందో తెలీదు. మరో రోజు ఆ వాహనం వస్తుందో రాదో తెలీదు. ఇలా ఎన్నిసార్లు తిరగాలని కార్డుదారులు ప్రశ్నించారు. సర్వర్‌ పనిచేయకుంటే తాము మాత్రం ఏ చేయగలమని సిబ్బంది తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు.


Advertisement
Advertisement
Advertisement