సారా.. ఏరులై..

ABN , First Publish Date - 2021-07-30T05:30:00+05:30 IST

జిల్లాలో సారా ఏరులై పారింది. శుక్రవారం వివిధ మండలాల్లో సారా తయారీ కేంద్రాలపై ఎస్‌ఈబీ, పోలీస్‌ సిబ్బంది దాడి చేశారు.

సారా.. ఏరులై..
కవిటి: స్వాధీనం చేసుకున్న సారాతో పోలీసులు

యారీ కేంద్రాలపై ఎస్‌ఈబీ, పోలీసు సిబ్బంది దాడి

2,232 లీటర్ల సారా స్వాఽఽధీనం ఫ భారీగా బెల్లంఊట ధ్వంసం


కవిటి/పాలకొండ/హరిపురం: జిల్లాలో సారా ఏరులై పారింది. శుక్రవారం వివిధ మండలాల్లో సారా తయారీ కేంద్రాలపై ఎస్‌ఈబీ, పోలీస్‌ సిబ్బంది దాడి చేశారు. 2,232 లీటర్ల సారాను స్వాఽఽధీనం చేసుకున్నారు. 3,650 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కవిటి మండలం శిలగాం వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 2000 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఇచ్ఛాపురం సీఐ ఎం.వినోద్‌బాబు తెలిపారు. లగేజీ ఆటోలో ఒడిశాలోని నవగాం నుంచి విజయనగరం జిల్లా చింతపల్లికి  అక్రమంగా తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు చెప్పారు. నిందితులు మాకుపల్లి దానయ్య, అమర ఎర్రయ్యలను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఒడిశాకు చెందిన వ్యాపారి వారది గున్నయ్య వద్ద 12 క్యాన్లలో 240 లీటర్లు, 44 బస్తాల్లో 1,760 లీటర్ల సారా కొనుగోలుచేసి తరలిస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. వీటి విలువ రూ.4.48 లక్షల ఉంటుందని అంచనా వేశారు. సారాను పట్టుకోవడంలో చాకచ్యంగా వ్యవహ రించిన ఎస్‌ఐ జి.అప్పారావు, కానిస్టేబుళ్లు  నీలకంఠం, రవిలను సీఐ అభినందించారు.ఫ సీతంపేట మండలం కుడ్డపల్లి వద్ద 90 లీటర్ల సారాతో సవర సురేష్‌ను ఎస్‌ఈబీ సిబ్బంది పట్టుకున్నారు. ఆయన  నుంచి సెల్‌ఫోన్‌, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాలకొండలోని రెల్లివీధికి చెందిన పి.రాధను సీతంపేట మండలం మండ గ్రామం వద్ద 120 లీటర్ల  సారాతో అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్‌ఈబీ సిబ్బంది తెలిపారు.ఫమందస మండలం కొండలోగాం సమీపంలోని కొండల్లో జిల్లా ఎస్‌ఈబీ జాయింట్‌ డైరెక్టర్‌ కె.శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ కేపీ గోపాల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నాలుగు బృందాలు దాడులు నిర్వహించాయి. మందస ఎస్‌ఐ కోట వెంకటేష్‌తో కలిసి నిర్వ హించిన కార్డన్‌సెర్చ్‌లో  3,650 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. 22 లీటర్లు  సారా, 165 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.సారా విక్రయిస్తున్న సవర కొసరాజును అదుపులోకి తీసుకొని కేసునమోదుచేశారు. అనంతరం గ్రామం పరిధిలోని కొండల వద్ద 450 లీటర్ల బెల్లం ఊట, 120 కిలోల నల్లబెల్లం, టపాగాం గ్రామంలో 750 లీటర్ల బెల్లం ఊట, ఇంద్రాడివీధిలో 450 లీటర్ల బెల్లం ఊట, 45 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.కాగా తయారీదారులు పరారీకాగా, ఊటలను ధ్వంసం చేసి, సారాను, నల్లబెల్లాన్ని   సోంపేట ఎక్సైజ్‌ స్టేషన్‌కు తరలించారు దాడుల్లో సీఐలు వెంకటప్పలనాయుడు, మురళీధర్‌, రమేష్‌బాబు, సతీష్‌కుమార్‌, ఎస్‌ఐలు నాగరాజు, సంధ్యారాణి, నాగరాజు, రమణ ఉన్నారు.  




Updated Date - 2021-07-30T05:30:00+05:30 IST