Abn logo
Jul 25 2021 @ 02:08AM

బడిలో సారా బట్టీ

నాడు-నేడు కింద ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేస్తుంటే.. కొందరు ప్రభుత్వ బడిలోనే నాటుసారా బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు జిల్లా తీరప్రాంతంలోని నిజాంపట్నం మండలం హారీ్‌సపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గుట్టుచప్పుడు కాకుండా నాటుసారా కాస్తున్నారు. అయినా విద్యాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీనిపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) నగరం అధికారులకు సమాచారం రావటంతో శనివారం పాఠశాలలో తనిఖీ చేపట్టి.. గున్నం శివపార్వతి ఆధ్వర్యంలో ఈ బట్టీ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. వారివద్ద నుంచి 10 లీటర్ల నాటుసారా, 100 లీటర్ల బెల్లం ఊట, గ్యాస్‌ పొయ్యి స్వాధీనం చేసుకుని బట్టీకి సంబంధించిన సామాన్లను ధ్వంసం చేశారు. దీనిలో అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని.. లేకుంటే బడిలోనే సారాబట్టీ పెట్టే ధైర్యం ఎవరికుంటుందని గ్రామస్థులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

- రేపల్లె