Abn logo
Aug 9 2020 @ 12:37PM

సచిన్ కూతురు సారా ‘మామూలు అమ్మాయి కాదు’

టీమిండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌గిల్‌, టెండుల్కర్‌ కూతురు సారా.. ఈ మధ్య సోషల్‌మీడియాలో పోటీపడి పోస్టులు చేసుకుంటూ.. చిలిపియుద్ధం చేశారు. ఇంతకూ వాళ్లిద్దరూ లవ్వులో పడ్డారా.. ఏమో? ఆ సంగతి మనకెందుకు కానీ.. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్‌గర్ల్‌గా మారిన సారా గురించి నాలుగు ముక్కలు తెలుసుకుందాం..


చదువు

సారా టెండూల్కర్‌ ముంబైలోని ధీరూబాయి అంబానీ స్కూల్‌లో చదివింది. ఉన్నత చదువుల కోసం లండన్‌ వెళ్లింది. అక్కడ మెడిసిన్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది.  


ప్రేమలు... రూమర్లు

అప్పట్లో ఆమె రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ చిన్న కొడుకు అనంత్‌ అంబానీతో ప్రేమలో ఉన్నట్టు రూమర్లు వచ్చాయి. ఇప్పుడు ఓ యువ క్రికెటర్‌తో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆమె షాహిద్‌ కపూర్‌ సినిమాతో తెరంగేట్రం చేయనున్నట్టు బీ-టౌన్‌లో గుసగుసలు కూడా వినిపించాయి. కానీ డాడీ సచిన్‌ వాటిని కొట్టిపడేశాడు.  


వంట కూడా...

సారాకు కిచెన్లో ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం. క్వారంటైన్లో తండ్రి కోసం బీట్‌ రూట్‌ కబాబ్స్‌ చేసి పెట్టింది. కూతురు చేసిన కబాబ్స్‌ను కేవలం నిమిషంలో తినేసినట్టు చెప్పాడు సచిన్‌.  


వివాదాలు

2018లో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఒక వ్యక్తి సచిన్‌ టెండూల్కర్‌ ఇంటికి 32 సార్లు ఫోన్‌ చేశాడు. తాను సారాను ప్రేమిస్తున్నానని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని, లేకుంటే కిడ్నాప్‌ చేస్తానని బెదిరించాడు కూడా. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.  


ఫ్యాషన్‌ 

బాలీవుడ్‌ హీరోయిన్లకు సరియైున పోటీనిచ్చే సత్తా సారా సొంతం. ఆమె డ్రెస్‌ సెన్స్‌ ఫ్యాషన్‌ డిజైనర్లను సైతం ఆశ్చర్యపరుస్తుంది. పాలనురగలాంటి ఆమె మేని వర్ణంపై ఏ డ్రెస్‌ అయినా ఇట్టే నప్పేస్తుందని చెప్పే డిజైనర్లూ ఉన్నారు.  


సేవలో భాగం

సామాజిక సేవ కోసం నిర్వహించే మారథాన్లలో సారా తరచూ పాల్గొంటుంది. అమ్మమ్మ అనాబెల్‌ ముంబైలోని ‘అప్నాలయ’ ఎన్జీవోకు డైరెక్టర్‌. ఆ ఎన్జీవో తరపున పలు కార్యక్రమాలలో సారా పాల్గొని విరాళాలు సేకరిస్తుంటుంది. 


యమా యాక్టివ్‌

సామాజిక మాధ్యమాల్లో యమా యాక్టివ్‌గా ఉంటుంది సారా. ఇన్‌ స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ ఖాతాల్లో ఎప్పటికప్పుడు ఫోటోలు అప్డేట్‌ చేస్తూ అభిమానులను పెంచుకుంటోంది. ఆమె ఫోటోలను చూసేందుకే వేచి ఉండే అభిమానులు లక్షల్లో ఉన్నారు. అప్పుడప్పుడు సోషల్‌ మీడియా సాక్షిగా తమ్ముడిని ట్రోల్‌ చేస్తుంటుంది కూడా. ఫేస్‌బుక్‌లో ఆమె అభిమానులు ఖాతా నడిపిస్తున్నారు.  


ఇష్టమైన వ్యక్తి

సారాకు తన అమ్మమ్మ అనాబెల్‌ మెహతా అంటే చచ్చేంత ఇష్టం. ఆమెనే తన మొదటి స్నేహితురాలిగా చెబుతుంది. అనాబెల్‌ బ్రిటిషర్‌. సారా తాతయ్య ఆమెను లండన్‌లో చదువుకుంటున్నప్పుడు కలిశారు. 


హాబీలు

లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ కూతురే అయినా సారా కూడా సాధారణ అమ్మాయే. స్నేహితులతో చిట్‌ చాట్‌ చేయడమంటే మహా సరదా. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, నచ్చిన పాటలు వినడం ఇవే ఆమె హాబీలు. 

 

నాన్న గురించి ఏమందంటే...

తన తండ్రిని క్రికెట్‌ దేవుడిగా భారత ప్రజలు ఆరాధించడం సారాకు మొదట్లో ఏమీ అర్థం కాలేదు. సచిన్‌ బయోపిక్‌ చూశాక... భారత క్రీడాభిమానులు సచిన్‌ను ఎందుకు అంతలా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకుంది. 

Advertisement
Advertisement
Advertisement