ఆయన ప్రేమలో పడేలా చేశాడు.. సినిమా విడుదల బాధ కలిగించింది: Sara Ali Khan

స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌కి పరిచయమై తన బబ్లీ లుకింగ్, మంచి నటనతో గుర్తింపు పొందింది.. సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్‌ ముద్దుల తనయ సారా అలీఖాన్. ఇప్పటికే ఈ బ్యూటీ చేసిన కేదర్‌నాథ్, సింబా, లవ్ ఆజ్ కల్, కూలీ నెం.1 సినిమాలు విజయాన్ని అందుకోగా.. తాజాగా నటించిన ‘అత్రంగి రే’ మూవీ డిసెంబర్ 24 విడుదలకానుంది. 


ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘జీ5’లో డైరెక్ట్‌గా విడుదల అవుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, ధనుష్ హీరోలుగా నటించగా.. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుందీ హీరోయిన్ సారా.


ఈ మూవీ డిజిటల్ రిలీజ్ గురించి సారా మాట్లాడుతూ.. ‘మొదట నాకు కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే నేను వెండితెర కోసమే సినిమాలు చేసేదాన్ని. నేను థియేటర్‌లో విడుదల తర్వాత వచ్చే ఫీలింగ్ గురించి నాకు తెలుసు. కానీ అనంతరం యాక్టర్‌గా నా పాముఖ్యత దేనికి ఉండాలో తెలుసుకున్నా. ఇది నా నిర్ణయం కాద’ని చెప్పింది.


‘నాకు ఆనంద్ అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం కలిగేలా చేశాడు. కాబట్టి ఆ ఆలోచన విధానాన్ని ప్రశ్నించే  స్థాయి నాకు లేదు. అయితే ఒక విషయం చెప్పగలను. అంతిమంగా అందరూ ఈ సినిమా చూడటం ముఖ్యం. అందులో ఎక్కువ మంది దృష్టిలో పడితే, నేను గెలిచినట్టే. ప్రేక్షకులు నవ్వుతూ సినిమా చూస్తే చాలు అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంద‌’ని ఈ భామ తెలిపింది.


సారా ఇంకా మాట్లాడుతూ.. ‘నాకు అవసరమైన సమయంలో ‘అత్రంగి రే’ కథ నా దగ్గరకి వచ్చింది. ఈ సినిమా ఒక్కటే 2020 నాకు జరిగిన మంచి విషయం. అంతకుముందు చేసిన ‘లవ్ ఆజ్ కల్‌’ మంచి టాక్ తెచ్చుకోలేదు. అది ఫ్లాప్ అయిన పది రోజులకి ఆనంద్ జీతో కలిసి ఈ సినిమా చేస్తున్నా. నిజం చెప్పాలంటే.. గత సినిమా ఫ్లాప్ అవడం వల్ల నాపై నాకు నమ్మకం తగ్గింది. ఈ మూవీలో రింకు పాత్రని పోషించగలననే కాన్ఫిడెన్స్ కూడా లేదు. కానీ ఈ దర్శకుడు ఈ క్యారెక్టర్ చేయించి నాతో నేనే ప్రేమలో పడేలా చేశాడ’ని ఆమె పేర్కొంది.

Advertisement

Bollywoodమరిన్ని...