సప్తరాత్రోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-11T05:20:18+05:30 IST

మంత్రాలయం రాఘవేంద్రస్వామి 351వ సప్తరాత్రోత్సవాలు వైభ వంగా ప్రారంభమయ్యాయి.

సప్తరాత్రోత్సవాలు ప్రారంభం
గరుడ వాహనంపై ఊరేగితున్న ప్రహ్లాదరాయలు

ధ్వజారోహణతో నాంది పలికిన పీఠాధిపతి
ప్రత్యేక అలంకరణలో ఉత్సవమూర్తి

మంత్రాలయం, ఆగస్టు 10: మంత్రాలయం రాఘవేంద్రస్వామి 351వ సప్తరాత్రోత్సవాలు వైభ వంగా ప్రారంభమయ్యాయి. బుధవారం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో రాఘ వేంద్ర స్వామి మూలబృందావనానికి విశేష పూజలు నిర్వహించారు. రాత్రి మహా ముఖద్వారంపై ధ్వజారోహణలో భాగంగా జెం డాను ఆవిష్కరించి 351వ ఉత్సవాలకు నాంది పలికారు. యోగీంద్ర కళామండపంలో సాంస్కృతిక కార్యక్రమాలకు జ్యోతి ప్రజ్వలన చేసి పీఠాధిపతి భక్తులనుద్దేశించి మాట్లాడా రు. అంతకుముందు గోపూజ, అశ్వపూ జ, లక్ష్మీ పూజ చేశారు. అడ్మినిస్ర్టేషన్‌ కార్యాల యంలో ఏఏవో, మేనేజర్లు, క్యాష్‌ సెక్షన్‌, ఇంజనీర్‌ సెక్షన్‌, వీఆర్వో, సీఆర్వో సెక్షన్‌ కార్యాలయాలకు ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చి అక్కడ ఉన్న అధికారులను ఆశీర్వదించారు. అనంతరం ఉత్స వమూర్తి ప్రహ్లాదరాయల ను ఊంజల సేవ నిర్వహించారు. ఉత్సవ మూర్తి ప్రహ్లాదరాయలను చెక్క, వెండి, రజిత గజవాహనం, బంగారు, నవరత్నాల రథాలపై ఊరేగించిన దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి మొదటి రోజు ఉత్సవాలకు భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. యోగీంద్ర కళా మండపంలో కర్నూలుకు చెందిన లాస్య ఇన్‌స్టిట్యూట్‌ బృందంచేత కూచిపూడి నృత్యం, బెంగళూరుకు చెందిన కళాగౌరి నృత్యాలయ బృందం వారి భరతనాట్యం కనువిందు చేశాయి. కార్యక్ర మంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్వాన్‌ రాజా ఎస్‌ గిరిరాజాచార్‌, సుజీంద్రాచార్‌, గౌతమాచార్‌, ఆనంద తీర్థాచార్‌, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, శ్రీపతిఆచార్‌, సీఆర్‌వోలు రవి కులకర్ణి, విజయేంద్రాచార్‌, జయతీర్థాచార్‌, ఈఈ సురేష్‌ కోనాపూర్‌, ఏఈ బద్రినాథ్‌, ద్వారపాలక అనంత స్వామి, ప్రకాష్‌ ఆచార్‌, బీఎం ఆనందరావు, ప్రముఖ డోనర్‌ బళ్లారి నారాయణరెడ్డి, మంత్రాలయం సీఐ భాస్కర్‌, ఎస్‌ఐ వేణుగోపాల్‌ రాజు పాల్గొన్నారు.

గరుడ వాహనంపై ప్రహ్లాదరాయలు

ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 10.20 గంటల సమయంలో జరిగిన రథోత్సవాల ఊరేగింపులో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై స్వామివారిని అధిష్టించి ఊంజలసేవ, ధాన్యపూజను పీఠాధిపతి నిర్వహించి భక్తులను ఆశీర్వదించారు.

Updated Date - 2022-08-11T05:20:18+05:30 IST