’స్పందన’’కు 244 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2021-10-19T05:42:15+05:30 IST

ప్రజాసమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి 244 ఫిర్యాదులందాయి. అర్జీలను కలెక్టర్‌, జేసీలు నేరుగా స్వీకరించి పరిష్కరించాలని ఆయాశాఖల అధికారులను అదేశించారు.

’స్పందన’’కు 244 ఫిర్యాదులు
అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జేసీలు

అర్జీలను స్వీకరించిన కలెక్టర్‌, జేసీలు

పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు

గుంటూరు(తూర్పు), అక్టోబరు 18: ప్రజాసమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి 244 ఫిర్యాదులందాయి. అర్జీలను కలెక్టర్‌, జేసీలు నేరుగా స్వీకరించి పరిష్కరించాలని ఆయాశాఖల అధికారులను అదేశించారు. కార్యక్రమంలో జేసీలు దినేష్‌కుమార్‌, రాజకుమారి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు 8 ఫిర్యాదులు 

అంతకుముందు ఉదయం 10 నుంచి 11గంటల వరకు నిర్వహించిన డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు 8 ఫిర్యాదుల అందాయి. ఫిర్యాదులను నేరుగా కలెక్టర్‌ స్వీకరించారు. వాటిని సంబంధితశాఖల అధికారులకు పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

నా భర్త ఆచూకీ తెలపరూ: నవ్యశ్రీ

ఐజీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన భర్త బండిరెడ్డి లీలాకృష్ణ ఆచూకీ తెలపాలంటూ నవ్యశ్రీ  స్పందనలో ఫిర్యాదుచేశారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నేలటూరి కాంతకుమారి, చీపర్తి పరమేశ్వరరావు అనేవ్యక్తితో కలసి తన భర్తపై కిడ్నాప్‌కేసు పెట్టించారని వాపోయింది.గతంలో కాంతకుమారి పలువురిపై అక్రమ ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసి డబ్బులు వసూలు చేశారని, పోలీసులవద్దకు వెళ్తే న్యాయంజరగడం లేదని అందుకే ఇక్కడకువచ్చినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయంచేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.  

అటెండర్‌, వాచమన పోస్టులు భర్తీ చేయరూ...

జిల్లాలోని వివిధమండలాల్లో ఖాళీగా ఉన్న అటెండర్‌, నైట్‌ వాచమనపోస్టులను వీఆర్‌ఏలచేత భర్తీ చేయాలంటూ గ్రామ రెవెన్యూ సహయకులసంఘం ఆధ్వర్యంలో స్పందనలో వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా వీఆర్‌ఏలచే నైట్‌ వాచమన పనులు చేయించరాదని, ఖాళీగావున్న నైట్‌ వాచమన, అటెండర్‌ పదోన్నతులు వీఆర్‌ఏలచే భర్తీచేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. 


Updated Date - 2021-10-19T05:42:15+05:30 IST