Jul 9 2021 @ 23:05PM

హిందీ ‘హిట్‌’లో...

హిందీ ‘హిట్‌’లో కథానాయికగా సాన్యా మల్హోత్రా నటించనున్నారు. ‘హిట్‌’ చూశా. కాన్సెప్ట్‌ బాగా నచ్చింది. హిందీ రీమేక్‌లో నటించే అవకాశం రాగానే... వెంటనే అంగీకరించా. ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావాల్సిన ఆసక్తికరమైన కథ ఇది. రాజ్‌ (కుమార్‌ రావ్‌)తో కలిసి నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని సాన్యా మల్హోత్రా తెలిపారు. హిందీలో ‘దంగల్‌’, ‘బధాయి హో’, ‘శకుంతలాదేవి’, ‘లూడో’ తదితర చిత్రాల్లో ఆమె నటించారు.


తెలుగు ‘హిట్‌’లో రుహానీ శర్మ పోషించిన పాత్రను హిందీలో సాన్యా మల్హోత్రా చేయనున్నారని తెలిసింది. విశ్వక్‌సేన్‌ హీరోగా నాని నిర్మించిన కాప్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌’. టీ-సిరీస్‌ సంస్థతో కలిసి ‘దిల్‌’రాజు ప్రొడక్షన్స్‌ దీనిని హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో రాజ్‌కుమార్‌ రావ్‌ హీరో. తెలుగు ‘హిట్‌’తో దర్శకుడిగా పరిచయమైన శైలేష్‌ కొలను హిందీ వెర్షన్‌కూ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు.

Bollywoodమరిన్ని...