‘ఏజెంట్‌ కన్నాయిరం’గా సంతానం.. ఫస్ట్ లుక్ విడుదల

లిబ్రింత్‌ ఫిలిమ్స్‌ సమర్పణలో దర్శకుడు మనోజ్‌ బీదా దర్శకత్వంలో హీరో సంతానం నటిస్తున్న కొత్త చిత్రం ‘ఏజెంట్‌ కన్నాయిరం’. ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను యువ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ, విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. సంతానం, రియా సుమన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో శృతి హరిహరన్‌, పుగళ్‌, మునీష్‌కాంత్‌, ఈ.రామదాస్‌, అరువి మదన్‌, ఆధిరా, ఇందుమతి తదితరులు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. గురు సోమసుందరం ఓ గౌరవ పాత్రలో కనిపించనున్నారు. 


ఈ చిత్రం గురించి దర్శకుడు మనోజ్‌ బీదా మాట్లాడుతూ.. ‘‘ఇందులో హీరో సంతానం గత చిత్రాలకు భిన్నంగా కనిపిస్తారు. ‘డిక్కిలోనా’ వంటి మంచి విజయవంతమైన చిత్రం తర్వాత సంతానం చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. తేని ఈశ్వర్‌, శరవణన్‌ రామస్వామిలు చాయాగ్రహకులుగా పనిచేస్తుంటే, అజయ్‌ ఎడిటింగ్‌ పనులు పూర్తి చేయనున్నారు. త్వరలోనే విడుదల వివరాలను తెలియజేస్తాము..’’ అని వెల్లడించారు. 

Advertisement