జ్ఞానేంద్రప్రసాద్‌ మృతికి సంతాపం

ABN , First Publish Date - 2022-08-09T05:44:43+05:30 IST

బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్రప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నారన్న ఆయన అభిమానులు పార్టీలకతీతంగా విషాదంలో మునిగిపో యారు.

జ్ఞానేంద్రప్రసాద్‌ మృతికి సంతాపం

మియాపూర్‌, ఆగస్టు8(ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్రప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నారన్న ఆయన అభిమానులు పార్టీలకతీతంగా విషాదంలో మునిగిపో యారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. జ్ఞానేంద్రప్ర సాద్‌  మృతి పార్టీకి ప్రజలకు తీరని లోటని బీజేపీ రాష్ట్ర నా యకుడు మొవ్వా సత్యనారాయణ అన్నారు. నియోజకవర్గ ఇనచార్జి యోగానంద్‌, రవికుమార్‌ యాదవ్‌, మాజీ కార్పొరేటర్‌ నవతారెడ్డి,  నాయకులు బుచ్చిరెడ్డి, నాగేశ్వర్‌గౌడ్‌, మహే్‌షయాదవ్‌ ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని ఎమ్మెల్యే గాంధీ అన్నారు.  జ్ఞానేంద్రప్రసాద్‌ మృతి బాధాకరమని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్‌ అన్నారు. కార్పొరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత, ఎంసీపీఐ(యూ)నాయకులు అనిల్‌కుమార్‌, మురళీతో పాటు పలువురు నాయకులు తమ సంతాపం తెలియజేశారు. 

Updated Date - 2022-08-09T05:44:43+05:30 IST