ప్రపంచంలో అత్యుత్తమ దానం ఇదే..

ABN , First Publish Date - 2022-05-01T16:19:39+05:30 IST

ఒకానొకప్పుడు నైమిశారణ్యంలో వేలాది మంది ఋషులు...

ప్రపంచంలో అత్యుత్తమ దానం ఇదే..

ఒకానొకప్పుడు నైమిశారణ్యంలో వేలాది మంది ఋషులు, సాధువులు నివసించేవారు. ఋషులు. సాధువులు.. సూతమహామునిని ఉన్నత ఆసనంలో కూర్చోబెట్టి అతని ప్రసంగాలను వింటుండేవారు. సూత మహాముని ప్రత్యేకత ఏమంటే అతనుజీవితంలో ఎదరయ్యే అనేక సమస్యలకు పరిష్కారాలను సూచించారు. ఆయన ప్రసంగాలు వింటున్నవారంతా మంత్రముగ్ధలవడంతో పాటు తమకు కలిగే సందేహాలను ఆయన ముందు ఉంచేవారు. 


ఒకరోజు కొందరు సాధువులు సూతమహామునిని ఇలా అడిగారు.. మన జీవితంలో అత్యుత్తమ విరాళం ఏది? దానికి సూత మహాముని ఇలా సమాధానం చెప్పాడు... మనిషి తన కోసం నిరంతరం తపిస్తుంటాడు. ఇతరులకు కూడా ఏదో ఒకటి చేయాలి. మనం ఇతరులకు మేలు చేసే పనిని దానం అని అంటాం. ప్రజలు ధర్మ గుణాన్ని పాపపుణ్యాలతో ముడిపెడతారు. దానధర్మాలు అంటే ఎదుటి వ్యక్తికి ఏదైనా అవసరం ఉంటే అది తీర్చాలి. బంగారాన్ని దానం చేయడం, గోవును దానం చేయడం, భూమిని దానం చేయడం లాంటివన్నీ పవిత్ర దానాలుగా గుర్తింపు పొందాయి. దీనితో పాటు విద్యాదానం అనే మరో ప్రత్యేక దానం కూడా ఉంది. ఇది అందించిన దాత సుఖం, శాంతిని పొందుతాడు. సూత మహాముని ఇంకా దీని గురించి మాట్లాడుతూ విద్యాదానం చేయడం ఉత్తమమైనది. పాఠశాలలు నిర్మించేందుకు విరాళాలు అందించాలి. దీనివల్ల విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది. నిరక్షరాస్యులు తమ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే చదువులేని వారికి చదువు చెప్పేందుకు మనం సహకారం అందించాలి. విద్యావంతులకు ప్రతిచోటా గౌరవం దక్కుతుంది. విద్య వల్ల మనిషిలోని అజ్ఞానం తొలగిపోతుంది.

Updated Date - 2022-05-01T16:19:39+05:30 IST