Abn logo
Aug 2 2020 @ 16:41PM

పోతిరెడ్డిపాడు టెండర్లను ఆపేలా కేసీఆర్ చర్యలు తీసుకోవాలి: సంపత్ కుమార్

హైదరాబాద్: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ఆంద్రప్రదేశ్ చేస్తున్న టెండర్ల ప్రక్రియను వెంటనే ఆపేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ పనులు ఆపకపోతే కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారుని, తెలంగాణ దృహులుగా ఉంటారా, తెలంగాణ ప్రజల హృదయాలలో నిలుస్తారో తేల్చుకోవాలని ఆయన హెచ్చరించారు. 5వ తేదీన కేబినెట్ సమావేశం ఉన్నా కూడా సీఎం కానీ సీనియర్ మంత్రులు కానీ అపెక్స్ కమిటీలో, జూమ్ మీటింగ్ లో పాల్గొనొచ్చని సంపత్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి టెండర్ల ప్రక్రియ ఆపేసి సమావేశానికి రావాలని ఆదేశించారని, తెలంగాణ పోరాటం చేస్తేనే టీపీసీసీ వచ్చిందని, కేసీఆర్ మాట్లాడడం బెకుఫీ మాటలు అని, సోనియా వల్లనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ మాట్లాడిన విషయం మరోసారి గుర్తు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత కేటీఆర్ మీరంతా సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కాళ్లు మొక్కిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. మేం తెలంగాణ ఇవ్వడం వల్లనే నువ్వు మంత్రివి, మీ తండ్రి ముఖ్యమంత్రి, మీ బావ హరీష్ మంత్రి, మీ సోదరి కవిత ఎంపీ, మీ సోదరుడు సంతోష్ ఎంపీ అయిన విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. దళిత ఎమ్యెల్యే లు అడ్డగోలుగా మాట్లాడుతూ దళిత ద్రోహులుగా మిగిలిపోతున్నారని, దళితులకు ఇంత అన్యాయం జరుగుతుంటే పోరాటం చేయకుండా దొర కింద పనిచేస్తే దళిత ద్రోహులుగా మిగిలిపోతారని, దళిత జాతి రత్నాలుగా ఉంటారా, దళిత ద్రోహులుగా ఉంటారా తేల్చుకోవాలని సంపత్ కుమార్ సూచించారు.

Advertisement
Advertisement
Advertisement