సంక్రాంతి సందడి

ABN , First Publish Date - 2021-01-16T06:01:46+05:30 IST

సంక్రాంతి సందడి

సంక్రాంతి సందడి
రైతు కుటుంబానికి పట్టు వస్ర్తాలు అందజేస్తున్న కలెక్టర్‌ దంపతులు

 కంకిపాడు, జనవరి 15 : రైతు ఇంట నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని  కలెక్టర్‌ ఇంతియాజ్‌ అన్నారు. గురువారం వణుకూరుకు చెందిన రైతు ముక్కపాటి ప్రసాద్‌ ఇంట నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కలెక్టర్‌ సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గులను, వాటిపై గొబ్బిమ్మలను,  గంగిరెద్దుల ఆట పాటలను  తిలకించారు.  రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్‌ భద్రు, కంఠమనేని చిన్ని, రావి కోటేశ్వరరావు, గారపాటి మల్లేశ్వరరావు, వల్లె నరసింహారావు పాల్గొన్నారు.

ఫ భవానీపురం  : 45వ డివిజన్‌ జనసేన పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థిని బొమ్ము గోవిందలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం రోటరీనగర్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆటల పోటీలు జరిగాయు. విజేతలకు బహుమతులను, రెండు నిరుపేద కుటుం బాలకు తోపుడు బండ్లను జనసేన రాష్ట్ర అధికార పోతిన వెంకట మహేష్‌ అందించారు. జనసేన 42, 44, 46 డివిజన్ల కార్పొరేటర్‌ అభ్యర్థులు తిరుపతి అనూష, మల్లెపు విజయలక్ష్మి, షేక్‌ అమీర్‌ బాషా, నాయకులు బొమ్ము రాంబాబు, కొనుము శ్రీనివాసరావు, కాజా, రాజా,  సురేష్‌ పాల్గొన్నారు. 

ఫ 43వ డివిజన్‌ సీపీఐ ఆధ్వర్యంలో ఊర్మిళా నగర్‌లో శుక్రవారం బాల, బాలికలకు ఆటల పోటీల ను నగర సహాయ కార్యదర్శి జి. కోటేశ్వరరావు ప్రారంభించారు. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి. రాణి, నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, వై.జోసెఫ్‌, బాలయ్యలు పాల్గొన్నారు. 

ఫ 45వ డివిజన్‌ జోజినగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ముగ్గులు, ఆటల పోటీలను డివిజన్‌ పార్టీ కార్యదర్శి ఉప్పలపాటి శివప్రసాద్‌రాజు ప్రారంభించారు.  

ఫ 45వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి మైలవరపు మాధురి లావణ్య ఆధ్వర్యంలో జయదుర్గా ఫ్రెండ్స్‌ సర్కిల్‌ సహకారంతో సంక్రాంతి సంబరాలు ఘనం గా జరిగాయి. ముగ్గుల పోటీల విజేతలకు బహు మతుల ప్రదానోత్సవానికి టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత హాజరై అందించారు. విజయవాడ పార్లమెంట్‌ కో-ఆర్డినేటర్‌ లింగమనేని శివరామ ప్రసాద్‌, 45వ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు మైలవరపు కృష్ణ, సోషల్‌ వర్కర్‌ రాము,  పరిశపోగు రాజేష్‌, షేక్‌ ఆషా, కొండ పాల్గొన్నారు. 

ఫ అజిత్‌సింగ్‌నగర్‌: అజిత్‌సింగ్‌నగర్‌ లెనిన్‌ సెంటర్‌లో దేవిరెడ్డి రమేష్‌రెడ్డి ఆధ్వర్యాన జరిగిన వేడుకల్లో విజేతలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు బహుమతులు ప్రదానం చేశారు.  నాయకులు ఎండీ రుహుల్లా, ఏఎంసీ డైరెక్టర్‌ నందేపు సురేష్‌ పాల్గొన్నారు. 

ఫ వాంబేకాలనీలో బెవర నారాయణ ఆధ్వర్యాన క్రికెట్‌ టోర్నమెంట్‌, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు బహుమతులు అందజేశారు. 

ఫ సీపీఎం అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యాన అజిత్‌సింగ్‌నగర్‌, వాంబేకాలనీ ప్రాంతాల్లో యువకులకు ఆటల పోటీలు జరిగాయి.  విజేతలకు కృష్ణాహోటల్‌ సెంటర్‌లో జరిగిన సభలో బహుమతులు ప్రదానం చేశారు.

ఫపెనమలూరు: సంక్రాంతిని పురస్క రించుకున అఖిల భారత ప్రజాతంత్ర మహిళా విభాగం, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో యనమల కుదురు డొంక రోడ్డులో గురువారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులను అందజేశారు.  

ఫ గన్నవరం :  వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో  బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో విద్యా ర్థులకు, మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. వ్యవ స్థాపక అధ్యక్షులు ముక్కామల సుబ్బారావు, విక్టర్‌ బాబు, సీతారాం, రవిబాబు పాల్గొన్నారు.

ఫ ఎన్టీఆర్‌ అండ్‌ వైఎస్‌ఆర్‌ వన్‌డే కబడ్డీ టోర్నమెంట్‌ చైతన్య యూత్‌ స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో విజేతలకు కాంగ్రెస్‌ పార్టీ మహిళా నేత సుంకర పద్మశ్రీ పాల్గొని బహుమతులు అందజేశారు. 

ఫ మైలవరం : ఆర్యవైశ్య అసోసియేషన్‌, వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. శ్రీలేఖ గ్యాస్‌ కంపెనీ ప్రతినిధి మధు విజేతలకు బహుమతులను అందించారు. గూడవల్లి రామ్మోహన్‌రావు, కాజ మహేష్‌, ఉప్పల సుజా త, చలవాది మధుసూదన రావు, కోయ సుధ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T06:01:46+05:30 IST