Jul 28 2021 @ 04:30AM

సంక్రాంతికి...

పవన్‌కల్యాణ్‌, రానా దగ్గుబాటి హీరోలుగా నిర్మిస్తున్న చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు మంగళవారం విడుదల చేసిన మేకింగ్‌ వీడియోలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. హీరోలు ఇద్దరిపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో పోలీస్‌ అధికారి భీమ్లా నాయక్‌ పాత్రలో పవన్‌ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు: త్రివిక్రమ్‌, దర్శకత్వం: సాగర్‌ కె. చంద్ర, సమర్పణ: పీడీవీ ప్రసాద్‌, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ.