పిండి వంటలు రుచిగా రావాలంటే

ABN , First Publish Date - 2022-01-16T02:43:23+05:30 IST

సంక్రాంతి పండుగ సమయంలో ప్రతి ఇంటిలోనూ కనిపించే పిండివంటకాలలో అరిసెలు అత్యంత ప్రధానమైనవి.

పిండి వంటలు రుచిగా రావాలంటే

తెలుగు వారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగిన తరువాత సంక్రాంతి పండుగ చేసుకునే తీరులో మార్పులు వచ్చాయి కానీ  సంప్రదాయ వంటకాల పరంగా మాత్రం మార్పేమీ లేదు.  పిండివంటలు, ఇప్పటికీ ప్రతి తెలుగింట పండుగ రోజు నోరూరిస్తుంటాయి. భోగి పండుగగు వారం రోజుల ముందు నుంచే ఇంటిలో ప్రారంభమయ్యే హడావుడి ముక్కనుమ వెళ్లిన మూడు రోజుల వరకూ కనిపిస్తుంది. కొత్త ధాన్యం ఇళ్లకు చేరటంతో అరిసెలు, పూత రేకులు లాంటి  వెరైటీలతో పాటు పులగం, పరమాన్నం, చక్కెర పొంగళి, పాయసం.. ఇలా ఎన్నో వంటకాల విందు అలరిస్తుంటుంది. సంక్రాంతి పండుగ సమయంలో ప్రతి ఇంటిలోనూ కనిపించే పిండివంటకాలలో అరిసెలు అత్యంత ప్రధానమైనవి. తెలంగాణా, ఆంధ్ర, రాయలసీమ.. మూడు ప్రాంతాల్లోనూ అరిసెలు తప్పనిసరిగా సంక్రాంతి వేళ కనిపిస్తాయి. అరిసెల తయారీలో బియ్యం పిండి, బెల్లం అతి ప్రధానమైనవి. నూనె లేదంటే నెయ్యితో వీటిని తయారుచేస్తారు. అరిసెలకు రుచి, తమకు ఆరోగ్యం కావాలనుకునే వారు మాత్రం వీటిలో నువ్వులు కూడా వేస్తుంటారు. ఎలాంటి అరిసె అయినా బెల్లం పాకం పట్టడంలోనే దాని రుచి నిర్ధారించబడి ఉంటుంది. ఈ పాకం పట్టడంలోనే మహిళల నైపుణ్యతా తెలుస్తుంది. కరకరలాడటం లేదంటే సాగటం ఈ పాకం, దానిలో కలిపే పిండి పరిమాణాలతో పాటుగా వాడే నూనె కూడా అరిసెకు రుచి అందిస్తుంది. స్వచ్ఛత, రుచి కలిగిన గోల్డ్‌డ్రాప్‌ ఈ వంటలకు వినూత్న రుచులను అందిస్తుందని గోల్డ్ డ్రాప్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా తెలిపారు. అలాగే సకినాలు, జంతికలు... ఏవైనా సరే గోల్డ్‌డ్రాప్‌ నూనెతో రుచిలో వైవిధ్యత ఉంటుందన్నారు. ‘‘సంక్రాంతి పండుగ కాలంలో ప్రతి ఒక్కరూ విభిన్న రకాల  స్వీట్లు, రుచులు ఆస్వాదించడానికి ఇష్టపడుతుంటారు. పండుగ పూర్తయిన తరువాత కూడా ఇది కొనసాగుతుంది. అత్యుత్తమ నాణ్యత కలిగిన పదార్ధాలతో పాటుగా వాటి తయారీలో వినియోగించే నూనె కూడా అంతే నాణ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచ శ్రేణి నాణ్యత తయారీ ప్రమాణాలను అనుసరించే గోల్డ్‌ డ్రాప్‌ నూనెతో వండే పిండివంటలు, విభిన్న రకాల ఆహార పదార్థాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. మా వరకూ ఇది ‘సంక్రాంతి కా స్వాద్‌’’ అని లోహియా పేర్కొన్నారు.

Updated Date - 2022-01-16T02:43:23+05:30 IST