కోటవురట్లలోని సంతబయలు సీతారాముల ఆలయం వద్ద ముగ్గుల పోటీ
పాయకరావుపేట/రూరల్/ నక్కపల్లి/ఎస్.రాయవరం/కోటవు రట్ల, జనవరి 16 : సంక్రాంతి సం బరాలు నియోజకవర్గంలో అంబరాన్నం టాయి. ప్రజలంతా సంప్ర దాయ బద్ధంగా ఈ పండగను జరుపుకు న్నారు. శని, ఆదివారాల్లో పాయక రావు పేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవు రట్ల మండలాల్లో ఎక్కడ చూసినా కోలా హల వాతావరణం కని పించింది. సుదూర ప్రాంతాల్లో స్థిరప డిన వారు సైతం కుటుంబాలతో సహా విచ్చేశారు. హరిదాసులు, గంగిరెద్దుల వారు వీధుల్లో తిరిగి స్వయంపాకాన్ని స్వీకరిం చారు. వివిధ గ్రామాల్లో నిర్వ హించిన పోటీల్లో విజేతలకు బహుమ తులు అందజేశారు. ఆదివారం కనుమ పం డగ మరింత జోష్‌గా సాగింది. మాం సాహారాలు ఈ పండుగను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. పాడి రైతులు పాడి పశువులకు పూజలు చేశారు. పాండురంగస్వామి ఆలయంలో గోపూజ నిర్వహించారు. ఇదిలావుంటే, కేశవ రంలో సర్పంచ్ రామగోవిందు ఆఽధ్వర్యం లో ముగ్గుల పోటీలు నిర్వహించి విజే తలకు బహు మతులు అంద జేశారు. మాజీ సర్పంచ్ మేడిశెట్టి రాము, రమణ పాల్గొన్నారు.
నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. యువకులకు రన్నింగ్, కబడ్డీ, పోటీలు ఏర్పాటు చేశారు. ఎస్.రాయవరం, తిమ్మాపురం, భీమవరం, దార్ల పూడి, చినగుమ్ములూరు, కొరుప్రోలు, రేవుపోలవరం, ధర్మవరం, పెనుగొల్లు, సర్వసిద్ది, వమ్మవరం గ్రామాల్లో పం డగను అత్యంత ఘనంగా జరుపు కున్నారు. నక్కపల్లి మండలం అయ్య న్నపాలెంలో ముగ్గుల పోటీలు, విద్యార్థులకు అనేక పోటీలు నిర్వహించారు. విజేతలకు ఉపమాక స్టార్స్ ప్రతినిధులు డీవీఎస్ రావు, చెరుకూరి వేంకటేశ్వరరావు, మీసాల రామకృష్ణ, వెంకటాద్రి తదితరులు బహుమతులు అందజేశారు. ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రంగవల్లుల పోటీలు ఆకట్టుకున్నాయి. కోటవుర ట్లలో మహిళలకు ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అంద జేశారు. పాతసం తబయల రామాలయం వద్ద తీర్థాన్ని జరిపారు. కోటవురట్ల శివారు రాట్నాపాలెంలో పాండురాజు పండుగకు జనం పోటెత్తారు.