సంక్రాంతికి 17 వేల ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2022-01-04T16:36:49+05:30 IST

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 17 వేల ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖామంత్రి రాజాకన్నప్పన్‌ తెలి పారు. ఆయన నెల్లై జిల్లాలోని రెడ్డియార్‌ పట్టిలో చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్‌

సంక్రాంతికి 17 వేల ప్రత్యేక బస్సులు

అడయార్‌(చెన్నై): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 17 వేల ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖామంత్రి రాజాకన్నప్పన్‌ తెలి పారు. ఆయన నెల్లై జిల్లాలోని రెడ్డియార్‌ పట్టిలో చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా బస్సుల్లో ప్రయాణికులు నిలబడి ప్రయాణం చేసేందుకు వీల్లేదన్నారు. అయితే, సంక్రాంతి సమయంలో రద్దీని నివారించేందుకు వీలుగా 20 వేల బస్సులను సిద్ధంగా చేసినట్టు చెప్పారు. వీటిలో 17 వేల బస్సులను నడుపుతామని తెలిపారు. ప్రైవేటు బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేసే ప్రయాణికులు ఫిర్యాదు చేయాలని కోరారు. దీపావళి సమయంలో అధిక చార్జీలు వసూలు చేసిన ఏడుగురు ప్రైవేటు బస్సు యజమానులపై చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేశారు. 


Updated Date - 2022-01-04T16:36:49+05:30 IST