కెనడాలో తాకా వారి సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2021-01-18T18:03:01+05:30 IST

తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా(తాకా).. కెనడాలో సంక్రాంతి సంబరాలను అంతర్జాలంలో జనవరి 16న అంగరంగ వైభంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు ము

కెనడాలో తాకా వారి సంక్రాంతి సంబరాలు

తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా(తాకా).. కెనడాలో సంక్రాంతి సంబరాలను అంతర్జాలంలో జనవరి 16న అంగరంగ వైభంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాకా ఉపాధ్యక్షులు కల్పనా మోటూరి, సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి, వ్యవస్థాపక సభ్యులు అరుణ్ లయం వ్యాఖ్యతలుగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని.. కార్యదర్శి నాగేంద్ర హంసల కుటుంబం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం ఇరు దేశాల జాతీయ గీతాలను ఆలపించారు. సంబరాల్లో పాల్గొన్న కొందరు తాము వేసిన ముగ్గులను.. అందరికీ చూపించి, పండుగ ప్రముఖ్యతను తెలియజేశారు. అనంతరం కొందరు సభ్యులు తమ పిల్లలకు బోగి పండ్లు పోశారు. ఇది చూపరులను ఆకట్టుకుంది. 



హైమ కోట్ల, చంద్రిక పూష్నె, పావని పులివర్తి.. తాకా కొరకు అందంగా అలంకరించిన బొమ్మల కొలువు వీక్షలను కట్టిపడేసింది. అనంతరం తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి మాట్లాడుతూ.. అందరికీ సంక్రాంతి శుభాంక్షలు తెలిపారు. కొవిడ్ -19 సృష్టించిన కష్టకాలంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం తాకా వ్యవస్థాపక అధ్యక్షులు హనుమంతాచారి సామంతపూడి.. మహా సహస్రావధాని గరికిపాటి నరసింహారావును ముఖ్య అతిథిగా కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గరికిపాటి.. ‘నిత్య జీవితంలో సంక్రాంతి’ గురించి ప్రవచనం ఇచ్చారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగకు సంబంధించిన విశేషలను తెలపడంతోపాటు కార్యక్రమంలో పాల్గొన్న వారు అడిగిన ప్రశ్నలకు సహనంతో సమాధానాలు ఇచ్చారు. అనంతరం కుమారి ప్రవల్లిక వేమూరి, ఆశ్రిత పొన్నపల్లి, సాహిత, రిధిల పాటలు, నృత్యాలు అందరినీ ఉత్తేజపరిచాయి. తర్వాత.. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన సభ్యలను తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి అభినందించారు. చివరగా ట్రస్టీ ఛైర్మన్ బాషా షేక్.. కార్యక్రమంలో పాల్గొన్న వారికి, దాతలకు, అతిథిలకు వందన సమర్పణతో వేడులకను ముగించారు. 




Updated Date - 2021-01-18T18:03:01+05:30 IST