పల్లెల్లో సంక్రాంతి శోభ

ABN , First Publish Date - 2021-01-16T05:13:17+05:30 IST

పల్లెల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది.

పల్లెల్లో సంక్రాంతి శోభ
తూర్పుగంగవరంలో ముగ్గులు వేస్తున్న మహిళలు

ఉత్సాహంగా పండుగను జరుపుకున్న ప్రజలు

పలుచోట్ల ఆటల పోటీలు

పీసీపల్లి, జనవరి 15: పల్లెల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. మూడు రోజులపాటు ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. పెద ఇర్లపాడు, పీసీపల్లి, తలకొండపాడు తదితర గ్రామాల్లో కబడ్డీ, వాలీ బాల్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహు మతులు అందజేశారు. కొత్తగా పెళ్లైన అల్లుళ్లు అత్తారింటికి రావడం లో ఆ ఇళ్లు సందడిగా మారాయి. ఉపాధి కోసం చెన్నై, బెంగుళూరు, తెలంగాణ రాష్ర్టాలకు వెళ్లిన వారంతా సొంత గ్రామాలకు చేరుకోవ డంతో ఆయా గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది. 

పొదిలి: పొదిలిలోని అన్ని ప్రాంతాలలో గురువారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి.పట్టణంలోని వేణుగోపాలస్వామి, వాస వి కన్యకపరమేశ్వరి ఆలయం, నిర్మమహేశ్వరస్వామి దేవాలయం, సాయిమందిరాలు, శ్రీఅనంతపద్మనాభస్వామి దేవాలయం, వెంకయ్యస్వామి దేవాలయాలలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆయా దేవాలయాలలో జరిగిన కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సీఎస్‌పురం: మండలంలోని ప్రజలు సంక్రాంతి పండుగను మూ డురోజుల పాటు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌ తదితర పోటీలు నిర్వహించారు. స్థానిక కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర స్వామి, పెద్దమ్మ దేవస్థానాలలో పండుగ సందర్భంగా దేవతామూర్తు లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.


 ఆకర్షణీయంగా రంగవల్లులు

దొనకొండ, జనవరి 15 : దొనకొండ అడ్డరోడ్డులోని శ్రీ విజయాంజనేయస్వామి దేవాలయ ఆవరణలో సంక్రాంతి పండుగ సందర్భంగా ధర్మకర్త సిరిగిరెడ్డి బాలిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వినుకొండకు చెందిన డి.శైలజ, దొనకొండకు చెందిన రాజ్యలక్ష్మి, నాగలక్ష్మిలు వరసగా ప్రథమ, ద్వితీ య, తృతీయ బహుమతులు పొందారు 

తాళ్లూరు: సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలోని పలుగ్రామాల్లో గురు,  శుక్రవారాలు వివిధ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహించారు. నాగంబొట్లపాలెంలో నరసింహస్వామి తిరునాళ్ల నిర్వహించారు. గ్రామ టీడీపీ నేత వై.యల్లమందారెడ్డి ఆ ధ్వర్యంలో ప్రభను ఏర్పాటు చేసి కార్యకర్తలతో కొండకు తీసుకెళ్లి పూజలు చేశారు. తూర్పుగంగవరంలో సంతూర్‌, కిరాణామర్చంట్‌ సౌజన్యంతో శుక్రవారం ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామంలోని బొద్దికూరపాడుబస్టాండ్‌ వీధిలో మహిళలకు ముగ్గుల పోటీలు జరిపారు. కార్యక్రమంలో సంతూర్‌ కంపెనీ ఏఎస్‌ఎం జి.శ్రీనివాసరావు, డిస్ట్రిబ్యూటర్‌ జి.మణికంఠకుమార్‌, జెఎ్‌సవో జి.అశోక్‌ కుమార్‌, కిరాణిమర్చంట్‌ అసోసియేషన్‌  నేతలు, తదితరులు పాల్గొన్నారు. తాళ్లూరు యూత్‌ ఫోర్సు ఆధ్వర్యంలో వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. 

ముండ్లమూరు: మండలంలోని పలు గ్రామాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రంగవల్లుల పోటీలు నిర్వహించారు. శంకరాపురం గ్రామంలో  వైసీపీ నాయకురాలు మేడికొండ జయంతి ఆధ్వర్యంలో రంగవల్లులు, మ్యూజికల్స్‌ చైర్స్‌, కోలాటం నిర్వహించారు అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు వేములలో కబడ్డీ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.


Updated Date - 2021-01-16T05:13:17+05:30 IST