వైభవంగా సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2021-01-14T04:54:47+05:30 IST

ఆత్మకూరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. పల్లెలు బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి.

వైభవంగా సంక్రాంతి సంబరాలు
సన్మానం అందుకుంటున్న డీఆర్‌డీవో చైౖర్మన్‌ సతీష్‌రెడ్డి

బంధుమిత్రులతో పల్లెలు కళకళ 

భోగి వేడుకల్లో డీఆర్డీవో చైౖర్మన్‌ సతీ్‌షరెడ్డి 

భక్తులతో పోటెత్తిన ఆలయాలు

ఆత్మకూరు, జనవరి 13: ఆత్మకూరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. పల్లెలు బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి. వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు స్వగ్రామాలకు విచ్చేసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. బుధవారం వేకువజామున గ్రామాలు, పట్టణాల్లో పిల్లలు, పెద్దలు కలసి భోగి మంటలు వేసి సంక్రాంతికి స్వాగతం పలికారు. భారత రక్షణ సంస్థ (డీఆర్డీవో) చైర్మన్‌ గుండ్రా సతీ్‌షరెడ్డి తన స్వగ్రామమైన మహిమలూరులో కుటుంబ సభ్యులతో కలసి భోగి మంటలు వేశారు. భోగి మంటల అనంతరం మహిళలు ఇళ్ల ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. యువతీ, యువకులు ముగ్గులు, క్రికెట్‌ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిలూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఇండియన్‌ గ్యా స్‌ ఏజన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యాస్‌ వినియోగదారుల అవగాహన సదస్సులో డీఆర్డీవో చైర్మన్‌ గుండ్రా సతీ్‌షరెడ్డి ముఖ్య అతిఽథిగా పాల్గొన్నా రు. ఆయనను ఇండియన్‌ గ్యాస్‌ ఏజన్సీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ గ్యాస్‌ ఏజన్సీ జీఎం బీ ఆనందరెడ్డి, ఏజీఎం మోహన్‌రావు, గ్యాస్‌ ఏజన్సీ నిర్వహకురాలు జాకీరాసుల్తా నా, బీజేపీ నాయకులు కుడుముల సుధాకర్‌రెడ్డి, కరటంపాటి సుధాకర్‌ పాల్గొన్నారు. అనంతరం ఆయన ఆత్మకూరులోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బీ.సుందరరామిరెడ్డి ఇంటికి వెళ్లి జడ్పీ మాజీ చైర్మన్‌ బీ రాఘవేంద్రరెడ్డి, బొమ్మిరెడ్డి తారక్‌నాథ్‌రెడ్డిని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Updated Date - 2021-01-14T04:54:47+05:30 IST