రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
అమరావతి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మన సంస్కృతి సంప్రదాయాలకూ.. సొంత గ్రామాల మీద మమకారానికీ.. రైతులకిచ్చే గౌరవానికి ప్రతీకే సంక్రాంతి అని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అన్నారు. బుధవారం ఆయన ట్విటర్ వేదికగా రాష్ట్రప్రజలకు భోగి, మకర సం క్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సంబరాలతో తెలుగు లోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని, రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం ట్వీట్ చేశారు.