పత్తేబాద బ్రహ్మంగారి వీధిలో ముగ్గులు వేస్తున్న మహిళలు
ఏలూరు టూటౌన్, ఫైర్‌స్టేషన్, జనవరి 16: సంక్రాంతి పండుగను పురస్క రించుకుని ఏలూరు నగరంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఉత్సా హంగా ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించారు. యువత కోడి పందేలు, జూదాలు వంటి చెడువ్యసనాలకు లోనుకాకుండా ప్రజా సంఘాలు, స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. పోణంగి వైఎస్‌ఆర్ కాలనీలో ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి శివశంకర్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, పరుగు పందెం, సైక్లింగ్ వంటి పోటీలు నిర్వహించారు. మెప్మా జిల్లా అధ్యక్షురాలు పి. వెంకటరమణ బహుమతులు అందజేశారు. మహిళలు, యువత పాల్గొన్నారు.