సంక్రాంతి వచ్చిందే తుమ్మెద...

ABN , First Publish Date - 2021-01-14T05:35:28+05:30 IST

సంక్రాంతి వచ్చిందే తుమ్మెద...

సంక్రాంతి వచ్చిందే తుమ్మెద...

జిల్లా అంతటా సంక్రాంతి సందడి

తొలికోడిని తానే మేల్కొలిపి.. గజగజ వణికించే చలిని పక్కకు జరిపి.. హరినామ సంకీర్తనలతో మైమరపించి.. సన్నాయి రాగాలకు డూడూ బసవన్నలు శ్రావ్యంగా తలలూపి.. కోడి పందేలు.. గాలిపటాలు.. బొమ్మల కొలువులు.. ముచ్చటైన ముగ్గులు.. పిండి వంటల ఘుమఘుమలు.. కొత్త అల్లుళ్ల డాబూ దర్పాలతో కొత్త కాంతులను నింపుకొని సంప్రదాయ మేలు కలయికగా, మకర సంక్రమణంగా మన ముందుకొచ్చింది పెద్దల పండుగ.. అన్నింటి కంటే పెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు ధనూరాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఈ మహా పర్వదినాన వేడుకలు జరుపుకొనేందుకు జిల్లా ముస్తాబైంది.





Updated Date - 2021-01-14T05:35:28+05:30 IST