రైతులకు సంకెళ్లు వేసి అవమానించారు

ABN , First Publish Date - 2020-10-31T04:23:25+05:30 IST

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు పోలీ సులు సంకెళ్లు వేయడం రైతు లోకాన్ని అవమానించడమేనని ఎమ్మెల్సీ అంగర రామ మోహన్‌, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.

రైతులకు సంకెళ్లు వేసి అవమానించారు
పాలకొల్లులో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన ఎమ్మెల్యే నిమ్మల

పాలకొల్లు అర్బన్‌, అక్టోబరు 30 : రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు పోలీ సులు సంకెళ్లు వేయడం రైతు లోకాన్ని అవమానించడమేనని ఎమ్మెల్సీ అంగర రామ మోహన్‌, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన దళిత, బీసీ రైతులపై అక్రమంగా కేసు నమోదు, సంకెళ్లు వేసిన సంఘటనకు నిరసనగా గాంధీ బొమ్మల సెంటర్‌లో శుక్రవారం ఆందోళన చేపట్టారు. బీఆర్‌ అంబే డ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను విస్మరిం చి, సంఘ విద్రోహ శక్తులు, టెర్రరిస్టుల మాదిరి రైతులకు సంకెళ్లు వేయడం దారుణమని ఎమ్మెల్సీ అంగర, ఎమ్మెల్యే నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై అక్రమంగా పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కొంత మంది ఉద్దేశపూర్వకంగా కృత్రిమ ఆందోళనలు చేశారని, వారిని ప్రశ్నించిన దళిత రైతులపై కనీస విచారణ కూడా లేకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ కర్నేని రోజారమణి, కర్నేని గౌరునాయుడు, గండేటి వెంకటేశ్వరరావు, గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, చిట్టూరి సీతారామాంజనేయులు, రుద్రరాజు  సత్యనారాయణ రాజు, బోనం నాని, మాతా రత్నరాజు, ధనాని ప్రకాశ్‌, ఎం.ఫకీర్‌ బాబు, కడలి గోపాలరావు, పీతల శ్రీను, కొండేటి నరేష్‌, జల్లి ఏసు, సల్మాన్‌ భాజీ, షేక్‌ సిలార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-10-31T04:23:25+05:30 IST