Abn logo
May 29 2020 @ 04:46AM

అన్ని వర్గాలకు ప్రభుత్వం అండ

మంత్రి శంకరనారాయణ


అనంతపురం, మే 28 (ఆంధ్రజ్యోతి) : అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు.  ఈక్రమంలోనే కరోనా కష్ట సమయంలో అర్చకులు, పాస్టర్‌లు, ఇమామ్‌లకు ఆర్థికసాయం చేసి ఆదుకుందన్నారు.  గురువారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఉన్న మంత్రి ని అర్చక సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కరోనా కష్టకాలంలో ఆర్థికసాయం చేసినందుకు వారు మంత్రిని సన్మానించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భగవంతుడికి, సాధారణ భక్తులకు అనుసంధానకర్తలుగా ఉన్న అర్చకులు, పాస్టర్‌లు, మౌజాన్‌లు ఇబ్బందులు గమ నించి రూ. 5 వేలు చొప్పున ముఖ్యమంత్రి ఆర్థికసాయం అందించారన్నారు. కే వలం జిల్లాలోనే 4400 మందికి లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో అర్చక సంఘం నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్‌, అనంతపురం అర్చక సమాఖ్య అధ్యక్షుడు అంజన్‌కుమార్‌, ప్రధాన కార్య దర్శి ఆనంద్‌కుమార్‌, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమి షనర్‌ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement