కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమలశాఖ సహాయ మంత్రిసంజీవ్‌కుమార్‌ బాల్యన్‌

ABN , First Publish Date - 2022-07-02T05:16:21+05:30 IST

రాష్ట్రంలో అవినీతి సర్కారు రాజ్యమేలుతున్నదని కేంద్రమంత్రి సంజీవ్‌కుమార్‌ బాల్యన్‌ పేర్కొన్నారు. బీజేపీ చేపట్టిన తెలంగాణ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆయన మెదక్‌ నియోజకవర్గ స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతున్నని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధుల్లో 60 శాతం కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నదని

కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమలశాఖ సహాయ మంత్రిసంజీవ్‌కుమార్‌ బాల్యన్‌
మెదక్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర సహాయ మంత్రి సంజీవ్‌కుమార్‌ బాల్యన్‌

ప్రాజెక్టుల పేరుతో అవినీతి

మెదక్‌అర్బన్‌, జూలై 1: రాష్ట్రంలో అవినీతి సర్కారు రాజ్యమేలుతున్నదని కేంద్రమంత్రి సంజీవ్‌కుమార్‌ బాల్యన్‌ పేర్కొన్నారు. బీజేపీ చేపట్టిన తెలంగాణ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆయన మెదక్‌ నియోజకవర్గ స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతున్నని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధుల్లో 60 శాతం కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నదని చెప్పారు. సబ్‌కా సాత్‌.. సబ్‌కా విశ్వాస్‌ నినాదంతో ప్రధాని నరేంద్రమోదీ పాలన కొనసాగుతున్నదని స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతందని స్పష్టం చేశారు. అంతకుముందు ఆయన మత్య్సకారులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్య్సకారుల సంక్షేమం కోసం బీజేపీ తొలిసారి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. మత్స్యకారుల సంక్షేమం కోసం గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ. 32 వేల కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. వారికి రూ. 5 లక్షల బీమా, కిసాన్‌ క్రెడిట్‌కార్డులను అంజేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 3న హైదరాబాద్‌లో జరిగే ప్రధాని మోదీ సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం రాత్రి ఆయన జిల్లా కేం ద్రంలోని గోల్కండ వీధిలోని మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు అయితారం సంగీత ఇంట్లో భోజనం చేశారు. అనంతరం మెదక్‌ ఖిల్లాపై ఉన్న హరిత హోటల్‌లో బస చేశారు.  సమావేశంలో బిజేపీ జిల్లా ఇన్‌చార్జి మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది కేసీఆర్‌ కొడుకు, కూతురు! 

ఆంధ్రజ్యోతిప్రతినిధి, మెదక్‌, జూలై 1: తెలంగాణలో ప్రభుత్వాన్ని కేసీఆర్‌ కొడుకు, కూతురు నడిపిస్తున్నారని కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమలశాఖ సహాయ మంత్రి సంజీవ్‌కుమార్‌ బాల్యన్‌ విమర్శించారు. తెలంగాణ ఏర్పడింది ప్రజల కోసమా? కేసీఆర్‌ కుటుంబం కోసమా అని ప్రశ్నించారు. మెదక్‌ జిల్లా రామాయంపేటలో బీజేపీ సంపర్క్‌ అభియాన్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ కంటే ఆయన కుటుంబ పెత్తనమే ఎక్కువ నడుస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబం అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులు కడుతున్నారని, ఆ డబ్బుతో ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కుటుంబ పాలనకు తావు లేదని స్పష్టం చేశారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిస్తామని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ కార్యకర్త ముఖ్యమంత్రి కావడం తథ్యమని జోస్యం చెప్పారు. బూత్‌స్థాయి నాయకుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం బీజేపీలోనే సాధ్యమని, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లో ఇతరకులకు అవకాశమే ఇవ్వరని ఎద్దేవా చేశారు. దేశం మొత్తం నరేంద్రమోదీ నేతృత్వాన్ని కోరుకుంటున్నదని పేర్కొన్నారు. దేశంలో దశాబ్దాలుగా కుటుంబ పాల న సాగించిన కాంగ్రె్‌సకు మోదీ చరమగీతం పాడారన్నారు. కాంగ్రెస్‌ హయాంలో దేశంలో ఉగ్రవాదుల అలజడి తీవ్రస్థాయిలో ఉంటే, మోదీ పాలనలో సుస్థిర పాలన కొనసాగుతున్నదని స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


బీజేపీలో వారసత్వ రాజకీయాలకు తావు లేదు

 పాపన్నపేట, జూలై 1: కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ప్రజల కంటే వారసత్వ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయని కేంద్ర సహాయ మంత్రి సంజీవ్‌ కుమార్‌ బాల్యన్‌ పేర్కొన్నారు.  పాపన్నపేట మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు గ్రామాల నుంచి ప్రజలు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీలో వారసత్వ రాజకీయాలు బీజేపీలో తావులేదని స్పష్టం చేశారు. నరేంద్రమోదీ సంఘ ప్రచారక్‌ స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగారని, అమిత్‌షా బూత్‌స్థాయి నుంచి కేంద్ర హోంమంత్రి అయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎ్‌సలో ఇది సాధ్యమా అని ప్రశ్నించారు. బీజేపీలో పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, నాయకులు, పలువురు పాల్గొన్నారు. 



దేశం, ధర్మం కోసం పనిచేయండి

సంగారెడ్డి అర్బన్‌, జూలై 1: బీజేపీలో ప్రతీ కార్యకర్త దేశం కోసం.. ధర్మం కోసమే పనిచేస్తాడని రాజస్థాన్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ గులాబ్‌చంద్‌ కఠారియా పేర్కొన్నారు. సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయ న సంగారెడ్డి పట్టణంలో శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు, ముఖ్య నాయకులు, మహిళా మోర్చా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ పదవులు ముఖ్యం కాద ని, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో మహిళలకు సమాన పాత్ర ఉందని, రాజకీయాల్లో కూడా మహిళలు రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దేశ్‌పాండే, కన్వీనర్‌ నర్సారెడ్డి, నాయకులు హన్మంత్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, కార్యకర్తలు, పలువురు పాల్గొన్నారు.


తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతున్నది

కొల్చారం, జూలై 1: తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతున్నదని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు శివప్రతా్‌పశుక్ల పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా కొల్చారం మండల పరిఽధిలోని పోతంశెట్టిపల్లిలో శుక్రవారం ఆయన బీజేపీ మండల స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ బంధువులకు కాంట్రాక్టులు అప్పజెప్పి దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల హామీలను విస్మరించారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దయాకర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T05:16:21+05:30 IST