ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌ రేసులో సంజీవ్‌ సహోతా

ABN , First Publish Date - 2021-07-28T23:59:40+05:30 IST

భారత సంతతికి చెందిన బ్రిటిష్ రచయిత సంజీవ్‌ సహోతా.. ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్-2021కి పోటీ పడుతున్నారు. ‘ద బుకర్ డజన్’ లేదా 2021 లాంగ్‌లిస్ట్ పేరుతో 13 నవలల జాబితాను నిర్వాహకులు మంగళవారం

ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌ రేసులో సంజీవ్‌ సహోతా

న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన బ్రిటిష్ రచయిత సంజీవ్‌ సహోతా.. ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్-2021కి పోటీ పడుతున్నారు. ‘ద బుకర్ డజన్’ లేదా 2021 లాంగ్‌లిస్ట్ పేరుతో 13 నవలల జాబితాను నిర్వాహకులు మంగళవారం విడుదల చేశారు. అక్టోబర్ 1, 2020 తర్వాత బ్రిటన్, ఐర్లాండ్‌లలో ప్రచురితమైన 158 నవలల జాబితాను వడపోసి నిర్వాహకులు ఈ జాబితాను తయారు చేశారు. ఈ జాబితాలో సంజీవ్ సహోతా రచించిన ‘చైనా రూమ్’ నవల ఉంది. వలసదారుల అనుభవాల విషయంపై ‘చైనా రూమ్’ నవలలో అద్భుతమైన మలుపు ఉందని న్యాయనిర్ణేతలు ప్రశంసించారు. కాగా.. 2015లో సైతం సంజీవ్ సహోతా.. బుక్ ప్రైజ్‌కు షార్ట్ లిస్ట్‌ అయిన విషయం తెలిసిందే. 2017లో ఆయన యూరోపియన్ యూనియన్ సాహిత్య బహుమతిని అందుకున్నారు. ఇదిలా ఉంటే.. 1960 సంవత్సరంలో సంజీవ్ కుటుంబ సభ్యులు బ్రిటన్‌కు వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. 


Updated Date - 2021-07-28T23:59:40+05:30 IST