Money laundering: ఈడీ ముందు హాజరైన వర్షా రౌత్

ABN , First Publish Date - 2022-08-06T20:18:27+05:30 IST

పట్రా చావల్ రీడవలప్‌మెంట్ అవకతవకలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో శివసేన..

Money laundering: ఈడీ ముందు హాజరైన వర్షా రౌత్

ముంబై: పట్రా చావల్ రీడవలప్‌మెంట్ (Patra Chawl redevlopment) అవకతవకలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ (Varsha Raut) శనివారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్టు చేసింది. కస్టోడియల్ ఇంటరాగేషన్‌లో ఆయన నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వర్షను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.


కాగా, సంజయ్ రౌత్ కస్టడీని ఈనెల 8వ తేదీ వరకూ  పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ఈనెల 4వ తేదీన పొడిగించింది. పట్రా చావల్ రీడవలప్‌మెంట్ వ్యవహారంలో రౌత్ దంపతులకు రూ.3.3 కోట్లు ముట్టినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఇందులో ఎక్కువ మొత్తం వర్షా రౌత్ అకౌంట్లకు జమ అయ్యాయని చెబుతోంది. వర్షా రౌత్ బ్యాంక్ అకౌంట్లను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చామని ఈడీ తెలిపింది. తన భార్యకు ఇంత పెద్దమొత్తంలో సొమ్ము ఎలా అందిందనే విషయంలో ఈడీ అధికారులు సంజయ్‌ రౌత్‌ను తరచి తరచి ప్రశ్నించినప్పటికీ ఆయన నుంచి సరైన సమాధానం రాలేదని చెబుతోంది. ఈ కేసులో వారి స్టేట్‌మెంట్లు నమోదు చేసుకునే ప్రక్రియలో భాగంగా ఎవరి నుంచి సొమ్ము డిపాజిట్ అయిందనే విషయంపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. అలీబాగ్ ల్యాండ్ డీల్‌ డాక్యుమెంట్లతో సంబంధం ఉన్న వారిని కూడా శుక్ర, శనివారాల్లో ఈడీ పిలిపించి ప్రశ్నిస్తోంది.


తమ విచారణలో భాగంగా సేకరించిన డాక్యుమెంట్లను బట్టి చూస్తే అలీబాగ్‌లోని బీచ్‌సైడ్ ఆస్తులను నగదు రూపంలో భూ యజమానులకు చెల్లించి సంజయ్ రౌత్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోందని ఈడీ చెబుతోంది. పట్రా చావల్ రీడవలప్‌మెంట్‌ డీల్‌లో సంజయ్ రౌత్ సన్నిహిత మిత్రుడు ప్రవీణ్ రౌత్ కీలక పాత్ర పోషించారు. గురుఅవినాష్ కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్లలో ఒకరుగా గురుఆశిష్ ప్రవీణ్ రౌత్ ఉన్నారు. ఈ ప్రాజెక్టును ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలమైన గురు అవినాష్ కన్‌స్ట్రక్షన్ ఆ వివరాలను తొక్కిపెట్టి ఎఫ్ఎస్ఐకి అమ్మేసింది. ఈ ఫ్రాడ్ ద్వారా వచ్చిన రూ.1.2000 కోట్లలో రూ.112 కోట్లు కమిషన్‌ రూపంలో ప్రవీణ్ రౌత్‌కు చెల్లించారు. ప్రవీణ్ రౌత్‌‍కు అనుబంధంగా ప్రవీణ్ రౌత్ పనిచేశాడని, పట్రా చావల్ అవకతకవకల కారణంగా కోట్ల రూపాయలు సంజయ్‌ రౌత్‌ పొందారని ఈడీ ఆరోపిస్తోంది. ప్రవీణ్ రౌత్‌ను ఇప్పటికే ఈడీ అరెస్టు చేసింది.

Updated Date - 2022-08-06T20:18:27+05:30 IST