అప్పటిదాకా ధోనీ ఆడతాడు
ABN , First Publish Date - 2020-08-09T09:13:28+05:30 IST
ధోనీ రిటైర్మెంట్ గురించి ఎంత చర్చ సాగుతున్నప్పటికీ అతడి ఫిట్నెస్ విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహం ఉండదు...
న్యూఢిల్లీ: ధోనీ రిటైర్మెంట్ గురించి ఎంత చర్చ సాగుతున్నప్పటికీ అతడి ఫిట్నెస్ విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహం ఉండదు. ఏ రోజూ అతను యోయో టెస్టులో విఫలమైన సంద ర్భం లేదు. అందుకే జట్టులో అతను అత్యుత్తమ స్రింటర్గా ఉన్నంత కాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు. కోహ్లీ వివాహంలో కలిసినప్పుడు ధోనీ స్వయంగా ఈ విషయం తనకు చెప్పాడని గుర్తుచేశాడు. గతేడాది వన్డే వరల్డ్కప్ సెమీస్ తర్వాత ధోనీ భారత జట్టు తరఫున మరో మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు ఐపీఎల్ కోసం తిరిగి బ్యాట్ పట్టబోతున్నాడు.