Abn logo
Aug 12 2020 @ 11:14AM

సంజ‌య్‌ద‌త్ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ అభిమానుల పూజ‌లు

తాను సినిమాల నుంచి కాస్త‌ విరామం తీసుకుంటున్నానని, వైద్య చికిత్స కోసం వెళ్తున్నానని బాలీవుడ్ హీరో సంజయ్‌ద‌త్  ట్విట్టర్‌లో ప్రకటించారు. కాగా సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ‌ప‌డుతున్నారు. ఆయ‌న చికిత్స కోసం అమెరికా వెళుతున్నట్లు సమాచారం. కాగా ఈ వార్త వెలువ‌డ‌గానే ఆయ‌న అభిమానులు సంజ‌య్ ఆరోగ్యం కోసం సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రార్థ‌న‌లు చేయ‌డం ప్రారంభించారు. ఒక అభిమాని... మీరు జీవితంలోని అనేక క్లిష్ట పరిస్థితుల నుండి బయటకు వచ్చారు. ఈ ప‌రిస్థితి నుంచి కూడా బ‌య‌ట‌ప‌డ‌తారు. మీ కోసం ప్రార్థిస్తుంటామ‌ని ట్వీట్ ‌చేశారు. కాగా సంజ‌య్ ఆగస్టు 8 న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్ప‌డ‌టంతో ముంబైలోని లీలవతి ఆసుపత్రిలో చేరారు. కాగా సంజ‌య్ న‌టించిన సడక్- 2 చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్, అలియా భట్, పూజా భట్ త‌దిత‌రులు నటించారు. ఈ చిత్రానికి మహేష్ భట్ దర్శకత్వం వహించారు. 

Advertisement
Advertisement
Advertisement